ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెమీ ఫైనల్స్ ఫీవర్ నడుస్తోంది.. అయిదు రాష్ట్రాల ఎన్నికలదే హడావిడి. ఈ సెమీ ఫైనల్‌లో అప్పర్ హ్యాండ్ సాధించాలని, విజయకేతనం ఎగురవేసి ఫైనల్స్ కి ముందే ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికలు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌కి అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఎవరు ఎక్కువ రాష్ట్రాలలో జెండా ఎగురవేస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారుతోంది..
తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలోనూ ప్రభావితం చేస్తాయని లెక్కలు కడుతున్నారు విశ్లేషకులు.. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వేవ్ నడుస్తోందని, ప్రజలు ఆ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి.. తెలంగాణలో కనీస స్థాయి స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది కాషాయదళం.. తాజాగా ఎస్‌సీ వర్గీకరణకు ప్రధాని మోదీ సానుకూలంగా ప్రకటన చేయడంతో, తెలంగాణలో బీజేపీ పట్టు కోసం స్కెచ్ వేస్తోంది. ఎస్‌సీ వర్గీకరణతో కాంగ్రెస్‌కి చెక్ పెట్టాలనేది ఆ పార్టీ భావనగా భావిస్తున్నారు.. తెలంగాణలో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తే లోక్ సభ ఎన్నికల తర్వాత, ఆ పార్టీ తెరవెనక నుండి అయినా మద్దతు అందిస్తుందనేది బీజేపీ నేతల ప్లాన్.. ఇక్కడ ఓడిపోతే ఇప్పటికే కర్నాటకలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కి.. దక్షిణాదిలో ఆ పార్టీ పునాదులు షేక్ అవడం ఖాయం.. అందుకే, తెలంగాణలో బీఆర్‌ఎస్ విజయం కోసమే లేటెస్ట్ గా ఎస్‌సీ వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తెచ్చిందనే ఆలోచన ఉంది..
ఇటు, తెలంగాణతోపాటు మరో మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్‌కి సానుకూల ఫలితాలు దక్కితే, బీజేపీ తన వ్యూహాలను మార్చుకోవడానికి రెడీ అవడం ఖాయం అని వీకెండ్ కామెంట్ బై ఆర్‌కేలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎమ్‌డీ రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.. బీజేపీకి దేశవ్యాప్తంగా మిత్రుల అండ కావాల్సి వస్తుందని, అంచనా వేస్తున్నారు రాధాకృష్ణ.. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతే, ఏపీలో జగన్ కి కష్టకాలం మొదలవుతుందని, ఏపీలో ప్రభుత్వ పతనం ఖాయమని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..
ఈ ప్రకంపనలు కాషాయదళాన్ని షేక్ చేస్తాయని, అందుకే, సెమీ ఫైనల్స్ ఫలితాల తర్వాత మోదీ టీమ్ ఏపీలో తన వ్యూహం మార్చుకొని టీడీపీతో పొత్తుకు సిద్ధం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తన వీకెండ్ కామెంట్‌లో అభిప్రాయ పడ్డారు ఆర్‌కే.. ఇదే ఇప్పుడు వైసీపీని సైతం షాక్‌కి గురి చేస్తోంది.. తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాలలో అయినా కాంగ్రెస్ ఓడిపోతే, తనకు కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నారట. మరి, ఏంజరుగుతందో చూడాలి..











