తమిళ హీరో సూర్య ఇటీవల *ఆకాశం నీ హద్దురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశం నీ హద్దురా సినిమా ఓటీటీలో రిలీజైనా విశేష స్పందనతో సక్సస్ సాధించింది. ఈమధ్య కాలంలో సరైన సక్సస్ లేక వెనకబడిన సూర్యకు ఆకాశం నీ హద్దురా సినిమా సక్సస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. దీంతో వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు సూర్య 40వ సినిమా గురించి అప్ డేట్ వచ్చింది. అది ఏంటంటే.. సూర్య 40వ చిత్రానికి కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు పాండి రాజ్ దర్శకత్వం వహించనున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ మూవీ అని తెలిసింది. ఈ సినిమాని నెక్ట్స్ మంత్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ మూవీలో సూర్య సరసన నాని హీరోయిన్ నటించనుంది. నాని హీరోయిన్ ఎవరంటారా.. గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన ప్రియాంక మోహన్.
విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించిన ప్రియాంక మోహన్ సూర్య మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.ఇమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.