కొత్త నీరు రాక తప్పదు పాత నీరు పోక తప్పదు..! ఇదే మాదిరి కొత్త హీరోయిన్లు రాగానే పాత హీరోయిన్లను పక్కన పెట్టేయడం సినిమా రంగంలో షరా మాములే. వరుస హిట్లు వస్తే తప్ప హీరోయిన్ల కెరీర్ స్పాన్ మహా అయితే అయిదేళ్లకు మించడం లేదు. ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ ను మనోళ్లు బాగానే ఆదరించారు. రెడ్ కార్పెట్ వేసి వరుస సినిమా ఆఫర్లు ఇచ్చారు. అయితే ఏది పడితే అది చేయకుండా అనుపమ చాలా సెలెక్టీవ్ గా ఉంటూ సినిమాలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది.
దీంతో ఈ అతి జాగ్రత్త అనుపమ తన కెరీర్ లో స్లో అయ్యేలా చేసింది. దీనికి తోడు ఈ బ్యూటీ నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో అనుపమకు ఇప్పుడు ఆఫర్లు రావడమే కరవయ్యాయి. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కార్తీకేయ 2 లో నటిస్తుందనే టాక్ ఉంది. ఈ విషయమై ఇంకా చిత్ర వర్గాలు నుంచి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అయితే ఇంతలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అనుపమను పక్కనపెట్టేసి గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ ను తీసుకున్నారనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ మధ్య నడుస్తోంది.
అంతేకాదు గీతా ఆర్ట్స్ 2 వారు కూడా అనుపమను ఓ మూవీలో తీసుకుందామనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ లో అనుపమను ప్రియాంకతో రీప్లేస్ చేశారట. మరి ఎందుకని అనుపమను పక్కన పెడుతున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకనోగాని తెలుగులో అనుపమను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మధ్య రామ్ చరణ్ పక్కన కూడా అవకాశం వచ్చినా చివరికి ఆ పాత్రను వేరొకరు తన్నుకుపోయారు. కాలం కలిసిరాకపోతే కరోనా వచ్చిందన్నట్లుగా అనుపమ పరిస్థితి తయారైంది. ప్రియాంకకు మాత్రం ఇది వరంగా మారింది.











