ప్రజారాజధాని అమరావతి విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి గురువారానికి అయిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఆశయాలు, అవి అమలు జరిగిన తీరును ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పేర్కొన్నారు. విభజన నష్టాన్ని అధిగమించి, 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా దీని నిర్మాణం తలపెట్టామని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన దేశ ప్రధాని, దేశ, విదేశీ ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని ప్రస్తుత పాలకులు కాలరాశాన్నారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా, భారతదేశానికి గర్వకారణంగా నిలిచేలా నిర్మాణ రూపకల్పన చేసినట్లు తెలిపారు. కొందరు అవాస్తవ అరోపణలతో, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతోనో .. చట్ట విరుద్ధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణ యజ్ఞాన్ని భగ్నం చేయడం తుగ్లక్ చర్యని అన్నారు.
చూస్తుంటే బాధేస్తోంది
మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేశారు.వేలాది మంది కూలీలు, భారీ మెషీనరీతో, వాహనాల రాకపోకలతో కోలాహలంగా నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది.పోటీపడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహమన్నారు.13వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి తెచ్చిన పవిత్ర మట్టిని, పుణ్య జలాలతో అభిషేకించి శక్తి సంపన్నం చేసిన ప్రాంతం. మన రాష్ట్ర రాజధాని అమరావతి అని, దీనిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడి కర్తవ్యమన్నారు.
అమరావతిని కాపాడుకుందాం
నారా లోకేష్…
విభజనతో అన్యాయమై పోయిన ఆంధ్రులు దేశం గర్వపడే స్థాయిలో ఒక రాజధానిని కట్టుకుంటున్నారని చెప్పి దేశ ప్రధానితో సహా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రులను అభినందించారు. నాటి ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో కూర్చుని విధ్వంసకర ఆలోచనలు చేశారు. ఐదేళ్ళ క్రితం ఇదే రోజున శంకుస్థాపన చేసుకున్న అమరావతి నిర్మాణం కొనసాగివుంటే ఈరోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉండేది.కానీ ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేసి తమ ‘విషపునీయత’ చూపించుకున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా నిలిచి అమరావతిని కాపాడుకుందాం,
ఐదేళ్ళ క్రితం ఇదే రోజున శంకుస్థాపన చేసుకున్న అమరావతి నిర్మాణం కొనసాగివుంటే ఈరోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉండేది. కానీ ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేసి తమ 'విషపునీయత' చూపించుకున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా నిలిచి అమరావతిని కాపాడుకుందాం. (2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 22, 2020