అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. చైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. లవ్ స్టోరీ సెట్స్ పై ఉండగానే.. చైతన్య ‘థాంక్యూ’ మూవీని ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

నిన్ననే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. జోష్ సినిమా తర్వాత దిల్ రాజు చైతన్యతో మరో సినిమా చేయాలి అనుకున్నారు. ఓ కొత్త దర్శకుడితో చైతన్య మూవీ చేయాలనుకున్నారు కానీ.. అది సెట్ కాలేదు. ఆఖరికి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో మూవీ సెట్ అయ్యింది. ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి కథ అందించారు.
ఇందులో చైతన్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ కథ గురించి కానీ.. చైతన్య క్యారెక్టర్ గురించి అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. వరుస విజయాలు సాధిస్తున్న చైతన్య, డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేసే విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ ఏర్పడింది. మరి.. చైతు – విక్రమ్ కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Must Read ;- చై సామ్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఎన్నున్నాయో తెలుసా?
#ThankYouTheMovie …SHOOT BEGINS! @chay_akkineni @MusicThaman @pcsreeram @BvsRavi @Vikram_K_Kumar #DilRaju #Shirish #HarshithReddy pic.twitter.com/ErxR550r2w
— Sri Venkateswara Creations (@SVC_official) December 21, 2020











