ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు ..ఆ వెంటనే ఏపీ ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రానికి పెట్టబడులు రాని పరిస్థితి కల్పించారంటూ వైసీపీ పాలకులపై ఫైర్ అయ్యారు . రాష్ట్రానికి కేంద్రం 22లక్షల పక్కా ఇళ్లను మంజూరు చేస్తే.. 35శాతం కూడా నిర్మాణాలు పూర్తి చేయలేకపోయిందని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే ప్రభుత్వం తమ పేరు, ఫోటోలు పెట్టుకొని రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తోందన్నారు. అంతే కాకుండా చివరకు సచివాలయాలను కూడా కేంద్ర నిధులతోనే నిర్మించారని ఆరోపించారు . ఇక రాష్ట్రంలోని రోడ్ల, రహదారుల గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి, ప్రజలకు చేసింది ఏమి లేదని..అంతా కేంద్రమే చేసిందని చెప్పుకొచ్చారు.
. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. అయితే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అవినీతికి దూరంగా ఉండే పార్టీ అని చెప్పారు. విభజన బిల్లులో ఉన్న విధంగా ఏపీలో జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలకు ముందు రైతులకు 12 వేలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో కలిపే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్‌లో.. ప్రత్యేక హోదాలో జరిగే లబ్దిని పొందుపరచడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కేంద్రం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్లు ఎక్కడ అని ప్రశ్నించారు. . రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఏపీలో రివర్స్ టెండరింగ్‌తో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విమర్శించారు. సీఎం సొంత బాబాయ్ హత్య కేసుని దర్యాప్తు చేయలేమని ప్రభుత్వం చేతులేత్తేసిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎంపీ ఇంట్లో కిడ్నాపర్లు ఉన్నారంటే.. శాంతిభద్రతలు ఏ పరిస్థితిలో ఉన్నాయనే అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
పొలవరం పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. పోలవరం విషయంలో కేంద్రం ఎక్కడ జాప్యం చేయడం లేదని అన్నారు. పొలవరం నిర్మాణం చేయలేకపోతే కేంద్రానికి అప్పగించాలని అన్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం హామీ ఏమైందని జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. నాణ్యత లేని మద్యంతో మహిళల పుస్తెలు తెగుతున్నాయని అన్నారు. సుపరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ఈ స్థాయిలో చెలరేగడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది .. వైసీపీ కి బీజేపీ సన్నిహితంగా ఉందని అందరు అనుకుంటున్నారు .. ఇలాంటి తరుణంలో పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ..ఢిల్లీ నుంచి వచ్చిన స్పష్టమైన సంకేతాల వలనే ఆమె అలా మాట్లాడారన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఎమ్ఎల్సీ కోసం జగన్ కాళ్లపై పడి వేడుకోవాలన్నారు.. ఏపీ మంత్రి సంచలనం..!
కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీపై మండిపడ్డారు. పదేళ్ల పాటు ఆ పార్టీలో...