వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉండే ముఠాకక్షలు మరోసారి రోడ్డున పడ్డాయి. ఈసారి సాక్షాత్తూ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లానే ఇందుకు వేదిక అయింది. కమలాపురం నియోజకవర్గం వీరపునాయని పల్లె మండలం పాయసం పల్లిలో వైసీపీకి చెందిన రెండు ముఠాల మధ్య కొట్లాటలు జరిగాయి.
వీరపునాయునిపల్లె మండలం పాయసం పల్లిలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కత్తులు వేటకొడవళ్లతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. పలువురికి గాయాలయ్యాయి
వైసీపీ నేత సుధాకర్ రెడ్డిపై, మహేశ్వర్ రెడ్డి మరియు ఆయన అనుచరులు కత్తులు, వేటకొడవళ్లు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. అదే సమయంలో సుధాకర్ రెడ్డి కూడా.. వారిమీద రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘర్షణల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో వారిని ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.
కొత్త సంవత్సర వేడుకల్లోనే ఫాక్షన్ కక్షలు భగ్గుమనడం విశేషం. ఈ దాడిలో చంద్రశేఖరరెడ్డి, రాజారెడ్డి, వెంకటరామిరెడ్డి, అనే వ్యక్తులు గాయపడినట్లుగా తెలుస్తోంది.