ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. ఆయన దాదాపు అరగంట సేపు రాజ్ నాథ్ తో మాట్లాడటం ఆసక్తిగా మారింది. తన అరెస్టు తీరు మొదలునుంచి.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసే ప్రక్రియ వరకు మొత్తం రక్షణ మంత్రికి వివరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్ చేసేందుకు.. వైద్యులపై కేపీరెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
కేపీ రెడ్డితో పాటు టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిలు ప్రమేయం ఉందని, ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్ర చేశారని ఆరోపణలు చేశారు. రక్షణ మంత్రి కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మూడు పేజీల లేఖను అందించడం హాట్ టాపిక్ గా మారింది.











