మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు.గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడ ఢిల్లీ వెళ్లారు.వీరిద్దరిని బీజేపీ సీనియర్ నాయకుడు,పెద్దపల్లి మాజీ ఎంపి వివేక్ ఢిల్లీ తీసుకెళ్లారు.ఈ రోజు రాత్రికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి,తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలతో ఈటల భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వారిని కలసిన తర్వాత ఈటల ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
లోకేష్ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్..!
ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...











