ఓటీటీలో త్వరలో మరో సినిమా విడుదల కాబోతోంది. రాజ్ తరుణ్ హీరో గా రూపొందిన ‘ఒరేయ్ బుజ్జి’గా చిత్రాన్నిఆహా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించారు. ఈమధ్యే ఆహాలో ‘భానుమతి అండ్ రామకృష్ణ’, ‘జోహార్’ విడుదలయ్యాయి. నాని సినిమా వి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇప్పుడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న విడుదల చేయనున్నారు.
విజయ్ కుమార్ కొండా దర్శకత్వం దీనికి వహించారు. మాళవికా నాయర్, హెబ్బాపటేల్ హీరోయిన్లుగా నటించారు. కుమారి 21 ఎఫ్‌లో సూపర్బ్ కెమిస్ట్రీతో హిట్ పెయిర్‌గా నిలిచిన రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ మరోసారి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. యంగ్ హీరో రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్‌కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్‌ఘోష్, అన్నపూర్ణమ్మ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్ ముఖ్యపాత్రలు పోషించారు.
దీనికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె. రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌కుమార్ కొండ.
The wait is almost over!
We are all super excited to bring you 100% entertainment with #OreyBujjiga only on @ahavideoIN.Premieres October 2.
Don't miss the fun!
#MalvikaNair #HebahPatel @directorvijays @AnupRubens @SriSathyaSaiArt @KKRadhamohan @MangoMusicLabel pic.twitter.com/0BkufROwjJ
— Raj Tarun (@itsRajTarun) September 11, 2020