మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ లో రామ్ చరణ్ కూడా చేరిపోయారు. ఆ పాత్ర పేరు సిద్ధ అని తెలుస్తోంది. మా సిద్ధకు సర్వం సిద్దం అంటూ ఈ చిత్ర దర్వకుడు కొరటాల శివ కూడా ట్వీట్ చేశారు. ఇందులో రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతోందో కూడా విడుదల చేశారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఇందులో రామ్ చరణ్ పాత్ర లేదు. అసలు చాలా త్వరగా ఈ సినిమాని పూర్తి చేయాలని మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు.
కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే ప్రారంభమైన షూటింగులో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. దీని తర్వాత లూసిఫర్ రీమేక్ లో కూడా చిరంజీవి నటిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. అలాగే రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందరూ హీరోలూ కేవలం ఒక చిత్రానికి పరిమితమవకుండా ఏకబిగిన రెండు చిత్రాలు చేయడానికి కూడా సిద్దమవుతున్నారు.
ఇది ఓ మంచి పరిణామం అని కూడా అనుకోవాలి. ‘ఆచార్య’లో రామ్ చరణ్ ది గెస్ట్ రోల్ అని మొదట భావించారు. ఇది అతిథి పాత్ర కాదని, పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర అని సమాచారం. ఈ సినిమా కోసం 20 ఎకరాల విస్తార్ణంలో టెంపుల్ టౌన్ సెట్ వేశారు. ఇక్కడే షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా రామ్ చరణే. ఈ సెట్ కోసం దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. మణశర్మ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు రామ్ చరణ్ 30 రోజులు కేటాయించినట్లు తెలిసింది. మే 9న ఈ సినిమాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
మా ' సిద్ధ ' సర్వం సిద్ధం.
Welcoming our #ramcharan garu onto the sets of #Acharya. @AlwaysRamCharan @KChiruTweets #manisharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan @KonidelaPro @MatineeEnt pic.twitter.com/hJaaYDqF1K— koratala siva (@sivakoratala) January 17, 2021