June 6, 2026 11:43 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

వెండితెరకు వెలుగులద్దిన ధ్రువ‘తారక’ రాముడు (ఎన్టీఆర్ 25 వర్ధంతి)

ఎన్టీఆర్ అనే పేరు తెలుగు నాట తారక మంత్రం.. ఆ మహానటుడు పరమ పదానికేగి ఈ జనవరి 18కి 25 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

January 17, 2021 at 9:40 AM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆయన నటనకే పాఠాలు నేర్పిన బడిపంతులు.. అందంలో చందమామాను మించిన మేజర్ చంద్రకాంత్.. అభినయ నర్తన శాలకు ఆయనే సార్వభౌముడు. ఆయన గళం విప్పితే గర్జించే బొబ్బిలి సింహం.. ఆయనే మన నందమూరి తారక రామారావు.

ఐదు దశాబ్దాల నటన, అనితర సాధ్యమైన ప్రయోగాలు.. అది సాంఘికమైనా, జానపదమైనా, పౌరాణికమైనా.. పాత్ర ఏదైనా ఆయనకు నల్లేరు మీద నడకే. అందుకే సినీ చరిత్రలో ఎన్టీఆర్ శకం.. తెలుగు సినిమాకు శతకం. ఇరవైలో అరవై పాత్రలూ చేశారు.. అరవైలో ఇరవై పాత్రలూ చేశారు. ఆయన సాధించిన రికార్డులు అనితర సాధ్యం. అలాంటి నందమూరి తారక రాముడు పరమ పదించి ఈ జనవరి 18కి 25 ఏళ్లు. 1996 జనవరి 18 ఆయన కన్నుమూశారు. మన దేశం నుంచి తెలుగు దేశం వరకూ సాగిన ఆయన పయనాన్ని అవలోకిస్తే ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు.. అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం.

మన దేశంతో తొలి అడుగు

మైలు దూరం నడవాలంటే ఒక్క అడుగుతోనే మొదలవ్వాలి.. ఒక్క ఛాన్స్ తోనే నిరూపించుకోవాలి. అది ఎన్టీఆర్ విషయంలోనే జరిగింది. ఎన్టీఆర్ నటనా ప్రస్థానంలో తొలి అడుగు ‘మనదేశం’ సినిమాతోనే పడింది. నిజానికి ఆ సినిమా నటుల పేర్లలో ఎన్టీఆర్ ఎక్కడో మారుమూల కనిపిస్తుంది. మరి ఇలాంటి పాత్రను ఆయన ఎందుకు ఒప్పుకున్నట్టు. చరిత్రలోకి వెళితే ఆయన హీరోగానే సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని భావించినట్లు తెలుస్తోంది.

ఇంటర్ చదివేటప్పటి నుంచే నాటకాల జీవితం ప్రారంభమైనా అప్పటికి సినిమా ఆలోచన ఆయనకు లేదు. ఆయన బీఏ చదివేటప్పుడే రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఒకటి పి. పుల్లయ్య నుంచి, రెండోది రెండోది జంధ్యాల గౌరీనాధ శాస్త్రి నుంచి. బీఏ పూర్తయ్యే వరకు సినిమాలు చేసేది లేదని పుల్లయ్యకు ఎన్టీఆర్ చెప్పడంతో ఆ సినిమా ఛాన్స్ పోయింది. రెండోది జంధ్యాలవారి సినిమా ప్రారంభ దశలోని ఆగిపోయింది. ఎల్వీ ప్రసాద్ అప్పడప్పుడే పైకొస్తున్న దర్శకుడు.

ఆయన తన సినిమా కోసం కొత్త నటులను వెతికే క్రమంలో విజయవాడ రావడం, ఎన్టీఆర్ తో మాట్లాడటం జరిగింది. రంగస్థలంలో ఎన్టీఆర్ ఆవేశపూరిత పాత్రలు ఎల్వీ ప్రసాద్ కి బాగా నచ్చాయి. చిన్న పాత్ర ఉంది రమ్మనడంతో ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదు. బహుశా ఆయన హీరోగానే చేయాలనుకున్నట్లు ఉంది. పైగా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగం ఉంది. ఆ తర్వాత హీరో వేషం ఉందని ప్రసాద్ రమ్మనడంతో ఎన్టీఆర్ మద్రాసు వెళ్లారు. ‘నటుడిగా నేను పైకొస్తాను అని మీరు హామీ ఇస్తే నేను సినిమా రంగంలో ఉంటా. లేకపోతే వెళ్లిపోతా’ అని ఎన్టీఆర్ తెగెసి చెప్పారు.

ఎన్టీఆర్ ను తీసుకెళ్లి దర్శకుడు బీఏ సుబ్బారావుకు అప్పగించారు ఎల్వీ ప్రసాద్. అది ‘పల్లెటూరి పిల్ల’ సినిమా. హీరో వేషం ఎన్టీఆర్ కు ఖరారైపోయింది. పైగా అదికూడా మీర్జాపురం రాజా ఆర్థిక సహకారంతో రూపొందుతున్న సినిమానే. ఆయన తెరవెనుక పాత్రధారుడిగా బీఏ సుబ్బారావుతో ఆ సినిమా నిర్మించారు. చివరిగా ఎన్టీఆర్ తో ఎల్వీప్రసాద్ ఓ మాటన్నారు. ‘కెమెరా అంటే ఏమిటో నీకు తెలియాలంటే ఈ చిన్న పాత్ర వెయ్యి’ అంటూ ‘మనదేశం’లో ఇన్ స్పెక్టర్ పాత్ర గురించి చెప్పారు. అలా అనడంవల్లే ఎన్టీఆర్ ఆ పాత్రను ఒప్పుకోవలసి వచ్చింది. నిజానికి ఆయన లక్ష్యం హీరో చెయ్యాలనేదే. హీరో మీదే గురి పెట్టారు.. సాధించారు. మడమ తిప్పడం ఆయనకు చేతకాదు.. అడుగు పెట్టాక అంతు తేల్చాల్సిందే.

ఎన్టీఆర్ పలికిన తొలి డైలాగ్..

అప్పట్లో సినిమా షూటింగులు ఎక్కువ భాగం స్టూడియోల్లోనే జరిగేవి. ఎన్టీఆర్ పై తొలి సన్నివేశాన్ని కూడా శోభనాచల స్టూడియోలోనే చిత్రీకరించారు. ఇది రాజాగారి సొంత స్టూడియో. పోలీస్ ఇన్ స్పెక్టర్ వేషంలో ఎన్టీఆర్ మేకప్ తో సిద్ధమయ్యారు. అనుమతిలేకుండా సభ నడుపుతున్నందుకు ఉద్యమకారుడైన హీరో నారాయణరావును అరెస్టు చేసేందుకు ఎన్టీఆర్ వస్తారు. హీరో ఎదురు తిరుగుతాడు. పరిస్థితి అదుపు తప్పుతుంది. దాంతో లాఠీ చార్జి చేయక తప్పలేదు. దర్శకుడు ‘యాక్షన్‌’ చెప్పగానే ఎన్టీఆర్‌ ఏకంగా ఆ పాత్రలో జీవించేశారు.

‘ఈ మీటింగ్ జరగడానికి వీల్లేదు’ అని ఎన్టీఆర్ అంటే ‘జరుగుతున్న సభను ఆపడానికి వీల్లేదు’ అని హీరో నారాయణరావు బదులిస్తారు. ఇదే ఎన్టీఆర్ తొలి డైలాగ్. నారాయణరావు జవాబుతో ఎన్టీఆర్ చేతిలోని లాఠీకి పూనకం వచ్చేసింది. ‘ఛార్జ్ ’అంటూ అడ్డొచ్చిన వాళ్లను చితకబాదారు. సెట్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థంకాలేదు. దర్శకుడు ‘కట్‌…కట్‌’ అంటూ బిగ్గరగా అరిచేశారు. ఎన్టీఆర్ లో పూనకం తగ్గింది. ఆయనను దర్శకుడు ప్రసాద్ దగ్గరకు పిలిచాడు.

‘నటించవయ్యా అంటే నరమేధం సృష్టించేలా ఉన్నావే. చూడబ్బాయ్‌.. ఇది డ్రామా కాదు సినిమా. దీనికి ఫీల్డు అనేది ఉంటుంది గుర్తుంచుకో’ అంటూ సున్నితంగా మందలించారు. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఆయన చెప్పే ఓ డైలాగ్ ను ఎప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేరు. ‘ఇంతచిన్న కానిస్టేబుల్ నుంచి ఇంత పెద్దవాడిని అయ్యాను’ అంటూ పలికిన డైలాగు మాదిరిగానే నందమూరి తారకరాముడిని నిజంగానే అంతవాణ్ణిచేసి అత్యున్నత శిఖరాల మీద కూర్చోబెట్టింది. ‘మనదేశం’ పాత్రధారుడితోనే ‘తెలుగుదేశం’ పార్టీ పెట్టేలా చేసింది.

మొదటి సినిమాలోనే హీరోతో ప్రశంసలు

నాగయ్య తర్వాత అప్పట్లో పెద్ద హీరో సిహెచ్. నారాయణరావే. ఆ సినిమా షూటింగులో ఎన్టీఆర్ ని చూసి ఆయన అన్నమాట ఏమిటంటే ‘చూడు రామారావ్.. నీకు మంచి కంఠం ఉంది… మంచి రూపం ఉంది. కొన్ని దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏలేస్తావ్’ అన్నారట. ఆ మాట నిజమే అయి మూడున్నర దశాబ్దాల పాటు ఆయన సినిమా రంగాన్ని ఏలేశారు. ఏలడం అంటే పది, ఇరవై కాదు.. ఏకంగా ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగానికి ఆయనే రారాజు. 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు.. ఏ నటుడూ ఇన్ని రకాల వైవిధ్యమైన పాత్రలతో ఇన్ని చిత్రాల్లో నటించిన దాఖలాలు లేవు. ఇకముందు ఆ రికార్డు మరే హీరోకీ దక్కదు కూడా.

పల్లెటూరి నుంచి చెన్న పట్నానికి

ఎన్టీఆర్ సొంతూరు కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు. 1923 మే 28న జన్మించారు. నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకట్రామమ్మ దంపతులకు జన్మించారు. వ్యవసాయ కుటుంబం. స్వయంకృషితో గ్రాడ్యుయేషన్ వరకూ చదువుకుని ఎదిగారు. సైకిల్ పై తిరిగిన ఎన్టీఆర్ అదే సైకిల్ గుర్తుపై గెలుపొంది ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. పల్లెటూరి పిల్ల, షావుకారు సినిమాలతో సినిమాలతో హీరోగా ఆయన పయనం ప్రారంభమైంది. ఒకవిధంగా చెప్పాలంటే తొలి పాన్ ఇండియా హీరో కూడా మన ఎన్టీఆరే.

ఎందుకంటే 1951లో ఆయన పాతాళభైరవి సినిమా సాధించిన రికార్డులు అంతాఇంతా కాదు. తెలుగు సినిమాకు మరో స్టార్ హీరో దొరికాడని నిరూపించిన సినిమా ఇది. ఆ తర్వాత మల్లీశ్వరి, మిస్సమ్మ, మాయాబజార్ లాంటి సినిమా సాధించిన రికార్డులు అసాధారణమైనవి. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి పాత్రలు చూశాక దేవుడు ఇలాగే ఉంటాడని అందరూ అనుకున్నారు. అందుకే ఆయనను దేవుడిలా తెలుగు ప్రజలు ఆరాధించారు. హిట్ల జాబితా తీసుకుంటే ఇన్ని హిట్లు వచ్చిన హీరో మరొకరు లేరని కూడా మనం చెప్పవచ్చు. ఆంధ్రుల ఆరాధ్య దైవంగా జనం కొలిచి తమ నాయకుడిగానూ ఎన్నుకున్నారు.

1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన రికార్డును కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. ఐదు దశాబ్దాల నటన ఒక ఎత్తు.. 14 ఏళ్ల రాజకీయం మరో ఎత్తు. ప్రాంతీయ పార్టీల బలం ఎలా ఉంటుందో ఇందిరాగాంధీ లాంటి నేతకు చవిచూపించిన ఘనత మన ఎన్టీఆర్ ది. నాడు ఎన్టీఆర్ నాటిన తెలుగు దేశం అనే బీజం వట వృక్షంగా ఎలా విస్తరించిందో అందరికీ తెలుసు. ఆ మహానటుడు జీవించి ఉంటే ప్రధాని పీఠాన్ని కూడా అధిష్ఠించి ఉండేవారు. అలాంటి ఘనత కూడా ఒక్క తెలుగు నటుడికే దక్కి ఉండేది. కుటిల రాజకీయాలకు తట్టుకోలేరని కాబోలు ఆ భగవంతుడు త్వరగానే ఆయనను తన దగ్గరకు తీసుకెళ్లిపోయారు.

-హేమసుందర్ పామర్తి

Tags: Actor Nandamuri Taraka Rama RaoN.T. Rama raoNandamuri Taraka Rama Raonandamuri taraka rama rao death anniversaryNandamuri Taraka Rama Rao diednandamuri taraka ramaraoNR rama rao nandamuri taraka rama rao death anniversarynt rama raospecial story of ntr
Previous Post

ఆయన చేసిన సినిమాలకన్నా వదిలేసినవి ఎక్కువ!

Next Post

మెగాస్టార్ ఆచార్యకు ‘సిద్ధ’మైన రామ్ చరణ్

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Amazing Beauty Ankita Kharat Latest hot stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

బొమ్మపడేందుకు.. దిమ్మతిరిగే మార్గదర్శకాలు

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

ఒక పెళ్లి- ఒక చావు- ఒక డీల్.. మధ్యలో వరద టూర్ ..!

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist