కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ జతకట్టబోతున్నాడా? ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశమిది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ లియో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రాత్రి విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ ఉంది. దానికి కారణం ఇంతకు ముందు విడుదలైన వారసుడు. తెలుగులో వారసుడు రూపొందడం, ఆ సినిమా 15 కోట్టు రాబట్టడంతో విజయ్‌తో పాటు లోకేష్ కనకరాజ్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా లియో సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు 27 కోట్ల వరకు డిమాండ్ చేస్తోన్నట్లు సమాచారం. విజయ్ తెలుగు మార్కెట్‌కు డబుల్ ధర చెబుతోండటం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు విజయ్ తెలుగు డబ్బింగ్ సినిమాల్లో వారసుడు అత్యధికంగా 15 కోట్ల వసూళ్లను రాబట్టింది.దాంతో లియోకి 27 కోట్లు డిమాండు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం రామ్ చరణ్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. దీనికి కారణం ఈ సినిమా ఆర్ఆర్ఆర్ కాన్సెప్ట్ తో రూపొందుతోందని అంటున్నారు. విజయ్ పాత్ర రెండు షేడ్స్ లో ఉంటుందట. ఓ పాత్ర గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. రామ్ చరణ్ ఒప్పుకోకపోతే మరో హీరోని సంప్రదించే అవకాశం ఉంది. యష్ ని కూడా అడిగారట. తండ్రీకొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా సినిమా ఉంటుంది. అనిరుద్ రవిచంద్రన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు. విజయ్ తండ్రి పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
తమిళనాడులో విజయ్ కు ఎంతో క్రేజ్ ఉంది. అతనికి అభిమానులు కూడా ఎక్కువే. ఇది అతని 49వ పుట్టిన రోజు. అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. పైగా అతని పేరుతో అనేక సంక్షేమకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతని అభిమాన సంఘమైన విజయ్ మక్కల్ ఇయక్కమ్ ఆధ్యర్యంలో రక్తదాన శిబిరాలు, పేదలకు ఆర్థిక సహాయం, విద్యకు చేయూత లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో అతను రాజకీయ ప్రవేశం చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చే లియో సినిమా వచ్చే అక్టోబరు 19న విడులవుతుంది. ఈ సినిమాలోని ఓ పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేయబోతున్నారు.