మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది చరణ్ 15వ చిత్రం, దిల్ రాజు 50వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో తాజా షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభించనున్నారు. ఇందులో చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఈ మూవీకి స్టోరీ రాసింది శంకర్ కాదట. తమిళ దర్శకనిర్మాత కార్తీక్ సుబ్బరాజ్. ఈ విషయాన్ని తమిళ దర్శక, నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ స్వయంగా ఓ ఇంటర్ వ్యూలో తెలియచేశారు. ‘శంకర్ సార్ నా దగ్గర కథ తీసుకుని తనదైన శైలిలో డెవలప్ చేశారు. నేను ఈ సినిమా కోసం చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను’ అని కార్తిక్ సుబ్బరాజ్ తెలిపారు.
అంతే కాకుండా.. ఈ సినిమా కథ పొలిటికల్ డ్రామాగా సాగుతుందని కూడా కార్తీక్ సుబ్బరాజ్ రివీల్ చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే… ప్రచారంలో ఉన్న ఈ వార్త పై శంకర్ స్పందించలేదు. త్వరలో స్పందిస్తారేమో చూడాలి. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి.. చరణ్, శంకర్ కలిసి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సస్ సాధిస్తారో చూడాలి.











