ఎన్టీఆర్ – ఏఎన్ఆర్, చిరు – బాలయ్య… ఇలా తరతరానికీ ఇద్దరు పోటీ పడే హీరోలు ఉంటూనే ఉన్నారు. ఈ పేర్లు అలా బాగా పాపులర్ అవుతుంటాయి కూడా. ఇప్పటి జనరేషన్ కి పవన్ – మహేశ్ పేర్లు బాగా పాపులర్. ఫాలోయింగ్ విషయంలో వీరిద్దరూ సమవుజ్జీలే అని సినీ పండితుల అభిప్రాయం. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లాక మహేశ్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. మళ్లీ ఇప్పుడు పీకే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో మహేశ్ పోటీపడక తప్పేటట్లు లేదు. ప్రస్తుతానికి పవన్ కంటే మహేశ్ ముందంజంలో ఉన్నాడు. వకీల్ సాబ్ రిలీజైన తరువాత అసలు లెక్కలు ఏమిటన్నది తెలుస్తాయి. ఇక తాజాగా పవన్ పుట్టిన రోజుకు మహేశ్ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. మహేశ్ ట్వీట్ కి థ్యాంక్స్ చెబుతూ పీకే కూడా రిప్లై ఇచ్చాడు.
అయితే సాధారణంగా తన పోటీ హీరోలకి మహేశ్ చాలా దూరంగా ఉంటాడు. కానీ సడెన్ గా పవన్ కి విషెస్ చెప్పడం వెనక అసలు కథ ఏంటన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ తో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో జయదేవ్ సూచనతోనే మహేశ్ బాబు, పవన్ కి శుభాకాంక్షలు తెలిపినట్లుగా సమాచారం. కోరక రారు మహనీయులు అంటే ఇదేనేమో. సినిమా రంగంలో ఇలాంటి ఆరోగ్యం కరమైన పోటీ ఎప్పటికీ మంచిదే. కాకపోతే అభిమానుల మధ్య మాత్రం ఈ వార్ ఎప్పటికీ ఉంటుంది. వాటిని మన హీరోలు ఎంకరేజ్ చేయకుండా ఉంటే అందరికీ మంచిది.