ఢిల్లీ మెడలు వంచుతానని శపధాలు చేసి, అక్కడికి వెళ్లి కాళ్లు మొక్కుతోంది ఎవరో అందరికీ తెలుసు అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. ‘‘పార్లమెంట్‌లో 28 మంది ఎంపీలు ఉన్నా, ఒక్కరు కూడా ప్రశ్నించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 మంది ఎంపీలు ఉన్నారుకదా, వచ్చే పార్లమెంట్ సెషన్లో విశాఖ స్టీల్ ఫ్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టే దమ్ము మీకుందా? అని సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మంచి కోసం రాజకీయాలు పక్కన పెట్టి, ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చే చిత్తశుద్ధి తమకుంది’’ అని ట్వీట్ చేశారు.
ఢిల్లీ మెడలు వంచుతా అని శపధాలు చేసి, అక్కడికెళ్లి కాళ్ళు మొక్కుతోంది ఎవరో, ఎందుకో అందరికీ తెలుసు.
పార్లమెంట్లో 28 ఎంపీలు ఉన్నా, ఒక్కరు కూడా అక్కడ గొంతెత్తి ప్రశ్నించకుండా, ప్రతిపక్షం సమావేశాల్లో ఎమీ మాట్లాడలేదు అంటూ దద్దమ్మ కబుర్లు చెపితే, మీ వెర్రితనం చూసి జనాలు నవ్విపోతారు. https://t.co/cwGEdInwNE— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) May 30, 2021











