లాక్ డౌన్ వల్ల ఎంతోమంది పేదలు నష్టపోతున్నారని, ఇక తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగించవద్దని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గం కాదని, అందుకు ఎన్నో మార్గాలను ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం 4 గంటల సమయం ఇస్తే పేదలు ఎలా బతుకుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవాళ లాక్ డౌన్ పై క్యాబినెట్ సమావేశం కానుందని, పేదల గురించి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలన్నారు. కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే లాక్ డౌన్ కొనసాగించాలని తెలిపారు. తెలంగాణలో కేసులు తగ్గుముఖం పట్టాయని, ఇక లాక్ డౌన్ అవసరం లేదని పేర్కొన్నారు.
Telganana's Cabinet will be meeting today to discuss the extension of lockdown. I must reiterate my opposition. It's not a strategy to combat COVID-19. It APPEARS as a "hard on pandemic" strategy but all it does is destroy the lives of poor. 1/5
— Asaduddin Owaisi (@asadowaisi) May 30, 2021











