సినిమాకి హద్దులు లేవు, కథ బాగుంటే చాలు ఎక్కడైనా సినిమా ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. అయితే బాలీవుడ్ లో హిట్ కొట్టిన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేస్తే పెద్దగా ఆడటం లేదు కానీ అదే తెలుగులో హిట్ కొట్టిన సినిమాల్ని హిందీలోకి రీమేక్ చేస్తే మాత్రం ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ మధ్య చాలా తెలుగు బ్లాక్ బస్టర్లు బాలీవుడ్ బాట పడ్డాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేకై అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలానే పోకిరి సినిమా సల్మాన్ ఖాన్ వాంటెడ్ అనే పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు.
అంతేకాదు కిక్ మూవీని కూడా సల్లూ రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇటీవల బాలీవుడ్ హీరోల్లో రణవీర్ సింగ్ ఎక్కువుగా తెలుగు సినిమాల్ని హిందీలోకి రీమేక్ చేస్తూ హిట్లు కొడుతున్నాడు. జూనియర్ యన్టీఆర్ టెంపర్ ని హిందీలోకి సింబా పేరుతో రీమేక్ చేసి భారీగా కలెక్షన్స్ వసూల్ చేశాడు. ఆ తరువాత మనోడి కన్ను సరిలేరు నీకెవ్వరూ పై పడింది కానీ ఆ రీమేక్ ఇంకా కార్య రూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు రణవీర్ తెలుగులో రీసెంట్ గా హిట్ కొట్టిన భీష్మ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట, తానే సొంతంగా ఈ సినిమాను నిర్మించి విడుదల చేయాలని అనుకుంటున్నట్లుగా సమాచారం.










