నటసింహం నందమూరి బాలకృష్ణ పైకి గంభీరంగా కనిపించినా మనసు చాలా మంచిదనే టాక్ ఉంది. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి ముందుకు రావడంలో బాలయ్య ఎల్లప్పుడూ ముందుటారు. ఇదే రీతన బాలకృష్ణ మరోమారు తన సేవాగుణాన్ని బయట పెట్టే ప్రయత్నం చేశారు. హిందూపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ కేంద్రానికి 55 లక్షల విలువైన మెడిషన్స్ ను, పిపిఇ కిట్లును, అలాగే మాస్క్ లు మరియు ఇతర సామగ్రిని విరాళంగా ఇవ్వడానికి బాలయ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే బాలయ్య కరోనా నివారణ కోసం కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం ఏకంగా 1.25 కోట్ల సాయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలోని దాదాపు 12 వేల మందికి ఆయన మందులు ఇతర సామగ్రిని కూడా అందజేశారు. ఇక ఎప్పటి నుండో బాలయ్య బాబు తన బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్ నుండి పేద క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ నుంచి నెక్ట్స్ అప్ డేట్ కోసం నందమూరి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా కొన్నాళ్లు క్రిందట ఈ మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది. ఆ తరువాత ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఏంటనే విషయంలో కూడా బోయపాటి నుంచి లీక్స్ రాకపోవడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ మూవీ టీమ్ పై కాస్త గుర్రగానే ఉన్నారు.