మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తర్వాత భోళా శంకర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలు క్యారెక్టర్ ఉంది. ఆ పాత్రను ఫిదా బ్యూటీ సాయిపల్లవి చేస్తే బాగుంటుంది అనుకున్నారు. సాయిపల్లవిని కాంటాక్ట్ చేస్తే నో చెప్పింది. చిరు సినిమాలో ఆఫర్ ఇస్తే.. సాయిపల్లవి నో చెప్పడం అనేది హాట్ టాపిక్ అయ్యింది.
అయితే.. సాయిపల్లవి చిరు మూవీలో నటించకపోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు బయటపెట్టింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.. ఒకరు చేసిన పాత్రను చేయడానికి నేను ఆలోచిస్తాను. అంతకు ముందు చేసిన వారి కంటే బెటర్ గా చేయాలనే ప్రయత్నం వలన ఆ పాత్ర దెబ్బతింటుంది. అంతకు ముందు ఆ పాత్రను చేసిన వారి ప్రభావం ఎంతో కొంత పడుతూ ఉంటుంది. అంతే కాకుండా ఆ స్థాయిలో నేను చేయగలుగుతున్నానా? లేదా..? అనే ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అందువల్లనే నేను రీమేక్ సినిమాలు చేయనని చెబుతూ ఉంటాను. అంతకు మించి మరేమీ లేదు అని చెప్పింది.
ఇక చిరంజీవి అయితే.. సాయిపల్లవితో డ్యాన్స్ చేయాలి అనుకుంటున్నాను. సాయిపల్లవికి అన్నయ్యగా కాకుండా.. హీరోగా ఆమెతో కలిసి స్టెప్పులు వేయాలి అనుకుంటున్నాను అని లవ్ స్టోరీ ఈవెంట్ లో అందరి ముందు చెప్పడం విశేషం. మరి.. ఫ్యూచర్ లో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందేమో చూడాలి.
Must Read ;- నాగచైతన్య లవ్ స్టోరీ పై మహేష్ సూపర్ కామెంట్స్