వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాని గెలిపించిన మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ప్రపంచకప్ విజయం తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన శ్రీచరణని.. రాష్ట్ర మంత్రులు స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన.. శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా విజయంలో కీలకంగా వ్యవహరించిన ఆంధ్రా క్రికెటర్‌కి.. ఏపీ ప్రభుత్వం 2 కోట్ల 50 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. క్యాష్ ప్రైజ్‌తో పాటు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 హోదాతో ఉద్యోగం.. కడపలో ఆమెకు ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు.
మహిళల క్రికెట్‌లో విశ్వ విజేతగా నిలిచిన తర్వాత రాష్ట్రాన్ని వస్తున్న శ్రీచరణికి ఘనంగా స్వాగతం పలుకుతూ అన్ని పేపర్లలో మెయిన్ పేజ్ యాడ్ ఇచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. వరల్డ్ కప్ విజయంతో రాష్ట్రంలోని మహిళా క్రికెటర్లకు శ్రీచరణి ఇన్స్‌పిరేషన్‌గా మారారు. ఆమె స్ఫూర్తితో రాష్ట్రం నుంచి మరింత మంది మహిళా క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు, ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సాహం, అభినందనలు చూస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు శ్రీచరణి. చిన్న వయసులో మేనమామ దగ్గర క్రికెట్ నేర్చుకున్న శ్రీచరణి.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రైనింగ్‌తో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. తన కెరీర్‌లో ఇది మొదటి అడుగు మాత్రమేనని.. ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నానని చెప్పారు శ్రీచరణి











