ప్రముఖ తమిళ హీరో విశాల్, అనిషా రెడ్డిల నిశ్ఛితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరగడం తెలిసిందే. గత సంవత్సరం వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ సంవత్సరం ఆగష్టులో పెళ్లి చేసుకుంటామని చెప్పారు. ఆతర్వాత పెళ్లి అక్టోబర్ కి వాయిదా పడింది. చెన్నైలో నడిఘర్ సంఘం భవనం నిర్మాణం జరుగుతోంది. ఆ భవనం పూర్తైన తర్వాత అందులో పెళ్లి చేసుకోవాలనేది విశాల్ కోరిక. ఈ నడిఘర్ సంఘం భవనంలో త్వరలోనే విశాల్ వివాహం జరుగుతుంది అనుకుంటుంటే.. విశాల్, అనిషా విడిపోయారని వార్తలు వచ్చాయి.

అయితే.. విశాల్ కానీ, అనీషా కానీ ఈ వార్తల పై స్పందించలేదు. సెలబ్రీటీల పై ఇలాంటి వార్తలు సహజం. ఇదంతా పుకారే అనుకున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో అనీషా విశాల్ తో ఉన్న ఫోటోలను తొలగించింది. ఎప్పుడైతే అనీషా విశాల్ తో ఉన్న ఫోటోలను డిలేట్ చేసిందో అప్పటి నుంచి వీరిద్దరూ విడిపోయారనేది వాస్తవమే అని మరిన్ని వార్తలు వచ్చాయి. విశాల్ తండ్రి, నిర్మాత జికె రెడ్డి స్పందిస్తూ.. జనవరిలో విశాల్ వివాహం ఉంటుందని చెప్పారు కానీ.. అనీషా, విశాల్ విడిపోయారా..? లేదా… అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
అయితే.. విశాల్ మాత్రం ఈ వార్తల గురించి ఏం మాట్లాడడం లేదు. ఇటీవల వీరిద్దరూ విడిపోయారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. అనీషా ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతుందని.. ఈ వివాహానికి అనీషా ఓకే చెప్పిందని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని త్వరలోనే అనీషా ప్రకటించనున్నట్టు సమాచారం. సో.. ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమేనా..? కాదా..? అనేది త్వరలోనే తెలుస్తుంది.
Musr Read ;- దర్శకేంద్రుడుడి మాజీ కోడలు రెండో పెళ్లి. ఇంతకీ ఎవరితో.?











