మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ ఈ మధ్య ఒక నీతి సూత్రం చెప్పి .. తనే ఆచరణలో పెట్టకపోతుండడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చాంశనీయం అయింది. అదేనండీ.. ఈ కుర్రోడు త్వరలో సోలో బ్రతుకుకి మంగళం పాడనున్నాడు. అంటే పెళ్ళి చేసు కోబోతు న్నాడన్నమాట. ‘చిత్రలహరి, ప్రతిరోజు పండగే’ సినిమాలతో వరుస విజయాలు అందుకొని త్వరలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే లవ్ స్టోరీతో అభిమానుల్ని పలక రించబోతున్నాడు సాయి. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లోని పాటలు ఈ మధ్యే విడుదలై.. మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
‘నో పెళ్ళి.. దాంతల్లి.. ఈ తప్పే చేయకురా మళ్ళీ’ అంటూ రీసెంట్ గా విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా లోని పాటతో జనానికి హిత బోధ చేసిన ఈ మెగా కుర్రోడు .. ఇంతవరకూ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లిస్ట్ లో ఉండేవాడు. అందులో రానా, నితిన్, నిఖిల్ లాంటి వారంతా ఓ ఇంటివారైపోయారు. ఇప్పుడు ఇతడు కూడా పెళ్ళికి రెడీ అవుతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇంట్లో వారు చూసిన అమ్మాయినే సాయి పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలిసింది. తమ దగ్గర బంధువులమ్మాయిని చూసిన సాయి తేజ తల్లి.. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకురాగా.. ఆయన ఈ పెళ్ళి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే 2021 సమ్మర్ లో సాయిధరమ్ తేజ పెళ్ళి జరగబోతున్నట్టు తెలుస్తోంది.











