కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ గంగాధర్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూను చట్టవ్యతిరేకమైన చర్యగా అభివర్ణిస్తూ కేసు పెట్టడం భవప్రకటన స్వేచ్ఛను హరించడమే అని ఆయన వ్యాఖ్యానించారు.
నిర్మాణాత్మక విమర్శలను కూడా స్వీకరించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో నియంతృత్వంలో ఉన్నామో అర్ధం కావడం లేదని శైలాజానాధ్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
మీడియాకు ఇంటరర్వ్యూ ఇచ్చిన డాక్టరుకు విపత్తు నిర్వహణ చట్టం 2005 ఐపిసి సెక్షన్ 54,58 కింద సీఐడీ నోటీసులు ఇవ్వడం దారుణమని, వైద్యులకు సరైన రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వల్లే వైద్యులు కరోనా బారిన పడుతున్నారని గంగాధర్ చెప్పారని ఆయన అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు సేవలు అందిస్తున్నారు….. సరైన సదుపాయాలు లేవని ఎవరైనా అంటే ప్రభుత్వం వారిపై కక్ష సాధిస్తోందని శైలాజానాధ్ విమర్శించారు.
ఒక వైద్యుడిగా తాను చేసిన సూచనలు తీసుకోవాలి తప్ప, ఇవి విమర్శలు కావని గంగాధర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారని, గంగాధర్ పై కేసు పెట్టడం దుర్మార్గమైన చర్య….ప్రభుత్వం వెంటనే ఆ కేసును ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు.
డాక్టర్లు నోరు మెదపకూడదా?
కరోనా నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు డాక్టర్ల మీద సర్కారు కన్నెర్ర చేయడం ఇది తొలిసారి కాదు. నెలల కిందట డాక్టర్ సుధాకర్ విషయంలో ఇదే జరిగింది. డాక్టర్ అనితారాణి విషయంలో కూడా ఇలాగే జరిగింది. డాక్టర్లపై నోరుమెదిపితే చాలు సర్కారు కక్ష కట్టేస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మరో డాక్టరుపై కేసు పెట్టారు. ఈ డాక్టరు కాంగ్రెస్ తో అనుబంధం ఉండే వ్యక్తి అయ్యేసరికి పీసీసీ చీఫ్ శైలజా రంగంలోకి దిగారు.











