ఆంధ్ర ప్రదేశ్లోని చిత్తూర్ లో వైసీపీ ప్రభుత్వం తీరు పై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామా సర్పంచుల ఆవేదనను అర్ధం చేసుకోకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు సర్పంచులు నిరసనలు తీవ్రతరం చేస్తున్నారు.ఉమ్మడి చిత్తూర్ జిల్లా వ్యాప్తంగా సర్పంచుల సి ఎఫ్ ఎమ్ ఎస్ ఖాతాల్లో ఉన్న సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దొంగిలించారని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయం సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది కాబట్టి, నగర పోలీసులకి పిర్యాదు చేసారు.
అయితే సర్పంచులకు సంబందించిన ఆంధ్ర ప్రదేశ్ పంచాయత్ రాజ్ శాఖ నిధులు మళ్లించింది, వాళ్ళే తమ నిధిలు దొంగిలించారని ఆరోపించారు. ఇలా సర్పంచులు తమకథలు దొంగలించబడ్డాయని, తమ నిధుల్ని రికవరీ చేసినా తమకి అప్పగించాలని వేడుకుంటున్నారు. ఐన ఆ సొమ్ము అంత కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేది, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిధులతో సంబంధం లేదు.ఐన కానీ మా నిధులు స్వలాభాలకోసమే కాజేశారని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీద సైబర్ నేరం కింద కేసు ఫైల్ చేయాలనీ విజ్ఞపతి చేసారు.
రాష్ట్రంలో అందులోను ఈ జిల్లాలో సర్పంచులకు రాక్శహం లేకుండా పోతున్నారని వాపోయారు.రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీముత్యాలరావు మాట్లాడుతూ ఫైనాన్స్ అసోసియేషన్ ద్వారా పంచాయతీలకు ఇచ్చే నిధులను విద్యుత్ శాఖకు ఇవ్వడంలో కొంత కుట్ర, దోపిడీ దాగి ఉందన్నారు. ఈ నెలలో సీఐడీ చీఫ్‌కు ఫిర్యాదు చేసి విచారణకు కోరతామని చెప్పారు. ఇప్పటికే కరెంటు బిల్లులు చెల్లించామని, మళ్లీ తమ నిధులను కరెంటు బిల్లులుగా దోచుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.