రాష్ట్రవ్యాప్తంగా 517 పంచాయితీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. చిత్తూరు 110, గుంటూరు 67 పంచాయితీలు ఏకగ్రీవాలయినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. చిత్తూరు వైకాపా 95, టీడీపీ 9, స్వతంత్రులు 6 ఏకగ్రీవమయ్యాయి. ఇక గుంటూరులో మొత్తం 67 పంచాయితీ ఏకగ్రీవమవగా.. అందులో 63 వైకాపా, 2 టీడీపీ, 2 స్వతంత్రుల ఖాతాలో పడ్డాయి.
తాజాగా ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రెస్ నోట్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఈ రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో పెండింగులో పెట్టాలని ఆదేశాలు తదుపరి ఆదేశాలు ఇచ్చేవారకు వీటిని పెండింగ్లో ఉంచాలని నిమ్మగడ్డ ఆదేశించారు.
Must Read ;- పంచాయతీ తొలివిడత నామినేషన్లు, ఏకగ్రీవాల లెక్క ఖరారు