June 25, 2026 9:33 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సెంటిమెంట్ : గుడివాడ నుంచి మంత్రి ఉంటే.. ఆ ప్రభుత్వం కూలినట్టే!

గుడివాడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా చరిత్రలో పూర్తికాలం బతికి బట్టకట్టలేదు. జగన్ కు ఇప్పుడు కొడాలి నాని రూపంలో అలాంటి ప్రమాదం ఉందా?

September 28, 2020 at 4:50 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(మచిలీపట్నం నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)

రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా చాలా ప్రాధాన్యం ఉంది. ఏ మతంలో ఎలాంటి సెంటిమెంటు ఉన్నా రాజకీయనాయకులు ప్రతి దానిని ఫాలో అవుతుంటారు. ఏ పుట్టలో ఏ పాముందో అని ఆశగా చూస్తుంటారు. ఇటీవల గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తిరుగు లేని మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తికాలం అధికారంలో కొనసాతుందా? లేదా? అన్న సందేహం తలెత్తుతోంది. అందుకు కొడాలి నాని హేతువు కావచ్చుననే సెంటిమెంట్ కూడా వినిపిస్తోంది. 

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము.భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సైతం ఒక్కోసారి కూలిపోవచ్చు. అది స్వయంకృపారాధం వలన కావచ్చు, లేక వెన్నుపోట్లు వలన కావచ్చు చెప్పలేము.

ఒకసారి చరిత్రలోకి వెళితే..

రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపథ్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి తనకు ఎదురులేదు అనుకున్న ఎన్.టి.రామారావు సైతం ఊహించని విధంగా అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను  చూస్తుంటే మళ్లీ అటువంటి పరిస్థితి తలెత్తుతుందా అనే సందేహం కలుగుతోంది. అంతేకాక రాజకీయాలలో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యతనిస్తారు రాజకీయనాయకులు. అయితే ఇప్పుడు అటువంటి సెంటిమెంట్ ఒకటి జగన్ సర్కారుకు గుది బండగా మారి దెబ్బతీస్తుందనే మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలకు, ఆధినేతలకు ఈ సెంటిమెంట్ కారణంగా వారి ప్రభుత్వాలు పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయాయి. అంటువంటి సెంటిమెంట్  కొడాలి నాని రూపంలో వైసీపీ ప్రభుత్వాన్నివెంటాడుతున్నది. 

ఇప్పటివరకు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు  ఎవరైనా రాష్ట్ర మంత్రివర్గంలో చేరితే ఆమంత్రివర్గం పూర్తిస్థాయి కొనసాగిన దాఖలాలు లేవు. టంగుటూరు ప్రకాశం పంతులు దగ్గర నుండి ఎన్.టి.రామారావు, చెన్నారెడ్డి వరకు అందరూ ఈ సెంటిమెంట్ వలన దెబ్బతిన్న వారే కావటం విశేషం. 

మద్రాసె ప్రెసిడెన్సీ పరిధిలో ఉన్న కాలంలో గుడివాడ అసెంబ్లీ గతంలో ద్విసభ్య నియోజకర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం  నుండి ఎస్.సి. శాసనసభ్యుడుగా ఎన్నికైన వేముల కూర్మయ్యకు టంగుటూరు ప్రకాశం  తన మంత్రివర్గంలో స్ధానం కల్పించారు. ఆ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో కొనసాగలేక పోయింది. 

అనంతరం 1983 లో కొత్తగా ఒకరాజకీయ పార్టీని స్థాపించి అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి 201 సీట్లుతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అధినేత ఎన్.టి. రామారావు గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శాసన సభ్యుడుగా ఎన్నికై  తొలిసారి కాంగ్రెసేతర

ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అటువంటి  ఎన్టీఆర్ సైతం 1984 లో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసి వచ్చింది. ఆ పిదప 1985  ఎన్నికలలో గుడివాడ, హిందూపురం నియోజకవర్గాల నుంచి ఎన్.టి.రామారావు ఎన్నికైనప్పటికి గుడివాడ స్థానానికి రాజీనామా చేసి హిందూపురం నియోజకవర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో గుడివాడ సెంటిమెంట్ గురించి వినిపించింది.

ఆ పిదప 1989 లో గుడివాడ అసెంబ్లీ నుంచి ఎన్నికైన కటారి ఈశ్వరకుమార్ ను చెన్నారెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే చెన్నారెడ్డి ప్రభుత్వం కూడా పూర్తికాలం మనుగడ కొనసాగించలేక  పోయింది. ఈ ప్రభుత్వాలు అన్ని పూర్తికాలం కొనసాగలేకపోవటానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గమే కారణంగా పలువురు ఒక సెంటిమెంట్ బలపడింది.

ముచ్చటగా మూడు సార్లు ఇక్కడనుండి ఎన్నికైన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రిమండలిలో చేరటం, ఆ మంత్రివర్గాలు పూర్తికాలం కొనసాగకుండానే ముగిసిపోవటం జరిగింది. ఆనాటినుండి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని ఒక సెంటిమెంట్ గా రాజకీయనాయకులు భావిస్తున్నారు.

జగన్ కు కూడా ఈ సెంటిమెంట్ గండం తప్పదా?

2019 లో జరిగిన ఎన్నికలలో  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలుచుకుని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా  తన మంత్రిమండలిలో గుడివాడ అసెంబ్లీ నుంచి ఎన్నికైన కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(నాని) కి స్థానం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి  తన 15 మాసాల పాలనలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నారు. అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలోని దేవాలయాలు, దేవతా విగ్రహాలపైన వరస దాడులు జరుగుతున్న నేపథ్యంలో  మంత్రి కొడాలి నాని  చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యాయి. 

దీనితో బీజేపీ తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు, హిందూ సంఘాలు అందోళన చేపట్టం తో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇదే సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ర్రాష్ట్ర మంత్రిగా ఉన్న కొడాలి నాని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన డిక్లరేషన్ పై వ్యాఖ్యానించటంతో  ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్ విశ్వహిందు పరిషత్ వంటి హిందూ సంఘాలన్నీ పెద్దఎత్తున ఆందోళన చేపట్టి కొడాలి నాని ని మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చెస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి హైద్రాబాద్ లోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని సైతం ముట్టడించారు. 

అంతేగాక బీజేపీ అధిష్టానం సైతం ఈ విషయంలో  రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చాలదుఅన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పైన, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ పైన  కూడా మంత్రి కొడాలి నాని తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంతో కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుండో బీజేపీ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని, అందుకు అదునైన సమయం కోసం ఎదురు చూస్తున్నది.

ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలను దృష్ట్యా ఇదే అదనుగా భావించి అసలు అధికారానికే ఎసరు పెట్టినా పెట్టవచ్చుననే భావన ఆపార్టీ నాయకుల మాట్లాడే మాటలను బట్టి వ్యక్తం అవుతున్నది. ఇప్పటికిప్పుడు బీజేపీ  ఏదైనా ఎత్తు వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేయకపోవచ్చు కానీ మోడీ, అమిత్ షాలు తలచుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సి.బి.ఐ., ఎన్ఫోర్స్మెంట్ కేసులను బయటికి తీసి మళ్లీ జైలుకు పంపించి, తమిళనాడు తరహాలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించవచ్చు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి కొడాలి నాని తెస్తున్న తలనెప్పులు వలన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వారు ఏమాత్రం చొరవతీసుకున్న ఆంధ్రప్రదేశ్ లో  అధికార మార్పిడి జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు గుడివాడ సెంటిమెంట్ కనక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై పనిచేస్తే త్వరలోనే రాష్ట్రంలో అనూహ్యంగా అధికార మార్పిడి జరిగే సమయం ఆసన్నమవుతున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే కొడాలి నాని రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కు పెద్ద గండం ఎదుర్కోవలసివస్తుందని, ఈ గండాన్నీ జగన్మోహన్ రెడ్డి దీటుగా ఎదుర్కొని నిలబడతారో లేక గత ప్రభుత్వాలు మాదిరిగా గుడివాడ సెంటిమెంట్ కు తమ ప్రభుత్వాన్ని బలిచేసుకుంటారో వేచిచూడాలి.

త్వరలో ఇదే సెంటిమెంట్ అంశం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉన్నట్లు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.

Tags: gudivada ministerjagan governmentleotop
Previous Post

విషప్రచారం ఆపండి.. అమరావతి ముంపు ప్రాంతం కాదు!

Next Post

పవన్ దేవుడు మాటిచ్చారు.. బండ్ల భక్తుడు పాటిస్తారట

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

అంత ‘సిన్’ లేదులే!

అమరావతి : కౌలు సమస్య తీరినట్టే!

దసరా ధమాకా! మంత్రివర్గంలో మార్పులు చేర్పులు..?

బీజేపీపై టీడీపీకి ఎందుకంత ప్రేమ?

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist