ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కు దేశీయంగా ఉత్పత్తి అయిన టీకాకు అనుమతి లభించింది. కరోనా కట్టడికి ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్ టీకాను దేశీయంగా, సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తోంది. ఈ కోవిషీల్డ్ టీకాకు డీజీసీఐ అనుమతించింది. టీకా పనిచేయడానికి 15 నుంచి 40 రోజుల సమయం పడుతోందని సంస్థ వెల్లడిచింది. 4 వారాల వ్యవధిలో రెండో డోసుల టీకా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటిటే రెండు దశలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సీరం ఇనిస్టిట్యూట్ టీకా మూడో దశ ప్రయోగాలు నడుస్తున్నాయి. అత్యవసర వినియోగం కింద సీరం ఇనిస్టిట్యూట్, ఆక్స్ ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాకు డీజీసీఐ అనుమతించింది. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్ 10 కోట్ల టీకాలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది.
వారంలో టీకా కార్యక్రమం ప్రారంభం
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా టీకా కార్యక్రమం చేపట్టేందుకు ఇప్పటికే నాలుగు జిల్లాల్లో కరోనా టీకా డ్రైరన్ విజయవంతం చేశారు. రేపు దేశ వ్యాప్తంగా కరోనా టీకా డ్రైరన్ నిర్వహించనున్నారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవడానికి ఈ డ్రైరన్ ఉపయోగపడుతుంది. వారంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ కార్యక్రమంగా ఇది నిలవనుందని ప్రధాని మోడీ ప్రకటించారు.