యవ హీరో నితిన్ – కేరళ కుట్టి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం రంగ్ దే. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కి అనూహ్యమైన స్పందన లభించింది. నితిన్ కి కరెక్ట్ గా సరిపోయే స్టోరీ అని టీజర్ ని బట్టి తెలియడంతో.. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా.? అనే క్యూరియాసిటీ ఏర్పడింది. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు.
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని గతంలో ప్రకటించడం కూడా జరిగింది. అయితే.. ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకుంది. కారణం ఏంటంటే… ఇప్పుడు థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కానీ.. 50 పర్సెంట్ ఆక్యూపెన్సీకే పర్మిషన్ ఇచ్చింది. 50 పర్సంట్ ఆక్యూపెన్సీ అంటే రిస్కే. అందుచేత 100 పర్సంట్ ఆక్యూపెన్సీ కి పర్మిషన్ వచ్చిన తర్వాతే రిలీజ్ చేద్దామనుకుంటున్నారట. పవర్ స్టార్ వకీల్ సాబ్ మూవీని కూడా ఈ కారణంతోనే సంక్రాంతికి రావాల్సిన సినిమాని వాయిదా వేసినట్టు సమాచారం.
మార్చి నుంచి 100 పర్సంట్ కి ప్రభుత్వం అనుమతి ఇస్తుందట. అందుకనే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఈ సినిమాకి రెండు వారాల ముందుగా అంటే.. మార్చి 26న రంగ్ దే మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. హోలి హాలీడేస్.. సమ్మర్ హాలీడేస్ కలిసి వస్తాయని ఆ డేట్ ను ఫిక్స్ చేసారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.