బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ , దర్శక నిర్మాత కరణ్ జోహార్ ల స్నేహం ఈనాటిది కాదు . ‘దిల్ వాలే’సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కరణ్ పని చేసినప్పటి నుంచి స్నేహం.. తన మొదటి సినిమా ‘కుచ్ కుచ్ హోతా హై’లో కూడా షారుఖ్ ఖాన్ హీరో. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు . వారిద్దరి అనుబంధం గురించి రకరకాల వదంతులు వచ్చాయి . షారుఖ్ తన పెద్దన్నయ్య లాంటి వాడని, కరణ్ జోహార్ ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్యతో కరణ్ జోహార్ పేరు ఆన్ పాపులర్ అయింది.
వారసత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడని అందరూ కరణ్ జోహర్ ని తిట్టిపోశారు. ఈ సందర్భంలో షారూఖ్ ఖాన్ హీరోగా కరణ్ జోహార్ తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేద్దాం అనుకున్నారు. అయితే కరణ్ జోహార్ పై బాగా వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితులలో మరో వైపు తన కెరీర్ కూడా బాగుండక పోవడంతో షారూఖ్ ఖాన్ కొంత కాలం పాటు కరణ్ జోహార్ ని దూరం పెడుతున్నాడు. అట్లీ ప్రాజెక్ట్ తనే సొంతంగా రెడ్ చిల్లీస్ బ్యానర్ పై నిర్మించ బోతున్నాడు షారూఖ్.బాలీవుడ్ లో ఈ మార్పు హాట్ టాపిక్ అయింది .










