పది రోజులుగా క్రమంగా బంగారం వెండి ధరలు దిగివస్తున్నాయి. కరోనా కట్టడికి రష్యా టీకా విడుదల చేయడంతో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. కరోనా దెబ్బకు బులియన్ మార్కెట్లలో భారీగా పెట్టుబడిపెట్టిన ఇన్వెస్టర్లు క్రమంగా లాభాల స్వీకరణకు దిగుతున్నారు. దీంతో బంగారం వెండి ధరలు దిగివస్తున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఔన్సు గోల్డు 2080 డాలర్ల రికార్డు స్థాయిని తాకిన విషయం తెలిసింది. రెండు వారాలుగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డు రెండువారాల్లో 120 డాలర్లు తగ్గి, తాజాగా 1963 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో …
హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రూ. 140 దిగివచ్చింది. దీంతో 10 గ్రాముల స్ఛచ్ఛమైన పసిడి రూ.53580 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రూ.120 తగ్గింది. దీంతో తులం ఆర్నమెంట్ బంగారం రూ.49120 వద్ద ట్రేడ్ అవుతోంది. విశాఖలో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.140 దిగివచ్చింది. దీంతో విశాఖలో స్వచ్ఛమైన గోల్డ్ రూ.53350 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆగ్రమెంట్ గోల్డ్ రూ.120 తగ్గి రూ. 49120 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 100 పెరిగింది… దీంతో ఢిల్లీలో 10 గ్రాముల ఫ్యూర్ గోల్డ్ రూ. 54540 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరిగింది . దీంతో ఆర్నమెంట్ గోల్డ్ రూ.50000 వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.47 డాలర్లు పెరిగి, 1963 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి రూ. 50 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ.66350 లకు చేరింది.
రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధర తగ్గుతుందా?
అవుననే అంటున్నారు. అంతర్జాతీయ బులియన్ నిపుణుడు క్రిష్టఫర్ ఉడ్. రష్యా కరోనా టీకా విడుదలతోనే బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. మరో నాలుగైదు దేశాలు కోవిడ్ టీకా విడుదలకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మరికొన్ని దేశాల్లో కరోనా టీకా విడుదల అయితే బంగారం ధర 35 శాతం కరెక్షన్ కు గురయ్యే అవకావం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి ధరలు జీవితకాల గరిష్ఠ స్థాయిల నుంచి 40 శాత తగ్గిన చరిత్ర ఉందని బులియన్ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.