హైటెక్ సిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాగిన మత్తులో అతివేగంగా కారు నడిపిన ఇద్దరు వ్యక్తులు, బైక్ పై వెళుతున్న దంపతులను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో భర్త గౌతమ్ మరణించగా, భార్య శ్వేత తీవ్రంగా గాయపడింది. కారును అక్కడే వదిలి కారులోని నిందితులు పారిపోయారు. అయితే తర్వాత ఒకరు పోలీసులకు చిక్కారు. ప్రధానంగా ఇవి ప్రమాదానికి సంబంధించిన వివరాలు అయితే.. ఈ హైటెక్ సిటి రోడ్డు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మద్యం మత్తులో కారులో ఉన్న వ్యక్తులు కాశీ విశ్వనాథ్, కౌశిక్ అని పోలీసులు గుర్తించారు. సిగ్నల్ జంప్ చేసి వేగంగా వెళుతూ కౌశిక్ బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న గౌతమ్ అక్కడిక్కడే చనిపోగా, శ్వేత హస్పటల్‌లో చికిత్స పొందుతుంది.
ప్రమాదానికి కారణమైన కారు- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూల్ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కుమారునిదిగా పోలీసులు గుర్తించారు. కాటసాని ఓబుల్ రెడ్డి పేరుతో కారు ఆర్టీఏ రికార్డుల్లో నమోదు అయి ఉన్నట్లుగా గుర్తించారు.
కేసు దర్యాప్తులో భాగంగా కారు యజమాని కాటసాని ఓబుల్ రెడ్డికి నోటీసులు పంపనున్నట్లుగా పోలీసులు తెలిపారు. విశ్వనాథ్, కౌశిక్ లు యాక్సిడెంట్ చేసి కారు అక్కడే వదిలేసి పారిపోయారు.
కారును వదిలేసి ఒక ఓయో రూమ్‌లో వారిద్దరూ దాక్కున్నారు. కాశీ విశ్వనాథ్ పై గతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు అయిఉన్నట్లుగా తేలింది. గతంలోనే విశ్వనాథ్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చెయ్యాలని పోలీసులు రవాణా శాఖకు పంపించినట్లు తెలుస్తోంది. సదరు కాశీ విశ్వనాథ్ ను పోలీసుల అదుపులోకి తీసుకోగా, కౌశిక్ మాత్రం పరారయ్యాడు. జూబ్లీహిల్స్‌లోని పబ్బులో వీరిద్దరూ అర్ధ రాత్రి వరకు మద్యం సేవించిన వస్తూ ప్రమాదం చేసినట్లు తెలుస్తోంది. AlsoRead ;-BREAKING : మంత్రి అనిల్ కాన్వాయ్‌కు ప్రమాదం
ఎమ్మెల్యే పేరు చుట్టూ అనుమానాలు
కారు కర్నూలు ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డిది అనే సంగతి రికార్డుల పరంగా పక్కాగా తెలుస్తోంది. అది ఆయన కొడుకు కారు అని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నారా.. పోలీసులు అతణ్ని తప్పించడానికి ప్రయత్నిస్తున్నారా? అనే దిశగా ప్రజల్లో అనుమానాలు పుడుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న వ్యక్తులు ఎందరు? ప్రమాదం తర్వాత దిగిపారిపోతుండగా చూపించే సీసీ ఫుటేజీలను పరిశీలించి.. పోలీసులు తేల్చాలనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం గొడవ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మెడకు చుట్టుకునేలాగానే ఉంది.
AlsoRead ;-నారా లోకేష్ పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన ప్రమాదం