అసురన్ చిత్రం తమిళంలో ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. విజయం మాత్రమే కూడా స్ఫూర్తి కూడా ఇచ్చింది. ఇతర భాషల్లోకి హాట్ హాట్ గా రీమేక్ అవుతోంది. తెలుగులో ఇప్పటికే వెంకటేష్ తో సినిమా మొదలైంది. బాలీవుడ్ నుంచి షారూక్ దీనిపై కన్నేసినట్టు సమాచారం.
బాలీవుడ్ ఖాన్ త్రయంలో మిగతా ఇద్దరి కంటే షారుఖ్ రెండు మూడేళ్లుగా వెనకబడి ఉన్నాడు, షారుఖ్ నటించిన లాస్ట్ 4 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సేవ్ అయిపోయినప్పటికీ ఖాన్స్ మధ్య జరిగే నెంబర్ గేమ్ లో మాత్రం గెలవలేపోయాయి. దీంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు బూస్టింగ్ ఇచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ వంటి సౌత్ ఫ్లేవర్ ఉన్న స్టోరీతోనే సినిమా చేయడానికి కింగ్ ఖాన్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం.
అయితే ఈసారి చెన్నై ఎక్స్ ప్రెస్ మాదిరిగా కమర్షీయల్ కామెడీ ఎంటర్ టైనర్ కాకుండా కమర్షీయల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడట షారుఖ్. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అసురన్ ని బాలీవుడ్ ఆడియెన్స్ కి అందించేందకు కింగ్ ఖాన్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది.
ఈ సినిమాలో ధనుష్ డబుల్ యాక్షన్ చేశాడు, 50 ఏళ్ల తండ్రిగా, 25 ఏళ్ల కొడుకుగా రెండు పాత్రలు పోషించాడు. ఇదే సినిమాను తెలుగులో వెంకటేశ్ కూడా రీమేక్ చేస్తున్నాడు నారప్ప అనే టైటిల్ తో ఈ రీమేక్ తెరకెక్కుతుంది. తెలుగులో మాత్రం వెంకీ తండ్రి పాత్రలో మాత్రమే కనిపించబోతున్నాడు. ఇక షారుఖ్ కూడా ధనుష్ మాదిరిగానే డ్యూయల్ రోల్ చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలిసింది.
అచ్చంగా వెంకటేష్ మాదిరిగానే, తాను కూడా ధనుష్ సినిమా రీమేక్ లోకి వెళ్లిపోవాలని అనుకున్నప్పటికీ.. వయసుకు తగ్గట్టుగా కేవలం తండ్రి పాత్రను మాత్రమే చేయాలనే ఆలోచన ఈ 54 ఏళ్ల ఖాన్ కు ఉన్నట్టు లేదు. అందుకే తండ్రీ కొడుకుగా రెండు పాత్రలూ చేయడానికి సిద్ధమైపోయాడు. మరి ఈ రీమేక్ స్టోరీ షారుఖ్ ని మళ్లీ బాలీవుడ్ కి బాద్ షా ను చేస్తుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ.











