కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. కొంత మంది సినీతారలు సైతం కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది కరోనా నుంచి బయటపడ్డారు. అన్ని రంగాలను కరోనా కోలుకోలేని విధంగా దెబ్బ తీసిందని చెప్పచ్చు. ఇప్పుడు.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విదేశాల్లో స్టార్ట్ కావడంతో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. అయితే.. మన దేశంలో ప్రస్తుతం డ్రైరన్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే.. మన దేశంలో కాదు దుబాయ్ లో. ఆమె దుబాయ్ లో ఉంటుంది. అందుచేత అక్కడే వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబుకు వదిన, నమ్రత శిర్కోదర్ కి అక్క. మోహన్ బాబు ‘బ్రహ్మ’ మూవీలో కథానాయికగా నటించారు శిల్పా శిరోద్కర్. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి బాలీవుడ్ నటి ఆమెనే కావడం విశేషం.
ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ.. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే సురక్షితంగా ఉంటుందన్నారు. మనం మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని ఈ సందర్భంగా ఆమె తెలియచేశారు. తనకు వ్యాక్సిన్ ఇచ్చినందుకు యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను అన్నారు.