పాపులర్ సింగర్ సునీత రెండో పెళ్లి గురించి గత కొంత కాలంగా వార్తలు రావడం తెలిసిందే. ఆమె పెళ్లి గురించి వార్తలు వచ్చిన ప్రతిసారీ ఆమె ఖండించేది. ఈసారి మాత్రం పెళ్లి వార్తలను ఖండించకపోవడంతో నిజమే అనుకున్నారు. అనుకున్నట్టుగానే సునీత మ్యారేజ్ కి సంబంధించి వార్త బయటకు రావడం.. ఆతర్వాత ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని తెలియచేయడం జరిగింది. రామ్ వీరపనేనితో సునీత పెళ్లి జరగనుంది. ఇటీవల ఇండస్ట్రీలోని సన్నిహితులకు వీరిద్దరూ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు.
ఇంతకీ పెళ్లి ఎప్పుడు..? ఎక్కడ..? అంటే.. జనవరి 9న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఖరారు చేశారని తెలిసింది. ఇక ఎక్కడ అంటే.. హైదరాబాద్ లోని బిగ్ హోటల్ లో ఈ మ్యారేజ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ ఈ పెళ్లిని తన లైఫ్ లో ఎప్పటికీ మరచిపోలేనిది ఉండేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారని తెలిసింది. వీరిద్దరి న్యూ లైఫ్ కోసం న్యూ హౌస్ ని కూడా ప్లాన్ చేశారట. రామ్, సునీత మధ్య ఎప్పటి నుంచో ఫ్రెండ్ షిప్ ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒకటవుతున్నారు. ఓ వైపు పెళ్లి, మరో వైపు సంక్రాంతి ఈ రెండు కలిసి రావడంతో సెలబ్రేషన్స్ ను బాగా ప్లాన్ చేసారట. మొత్తానికి 2021 సునీత, రామ్ ఇద్దరికీ ఎప్పటికీ మరచిపోలేని ఇయరే.
Must Read ;- జనవరి 9న సింగర్ సునీత వివాహం?