మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి ఈ నెల 9న ఉదయ్ పూర్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ అంతా అక్కడకు చేరుకున్నారు. పెళ్లికొడుకు చైతన్య కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. ఇక రిసెప్షన్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. నిహారికను పెళ్లి కూతురు చేసిన ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు ఈ పెళ్లికి హాజరు కానున్నారు అనేది ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉన్న చిరంజీవి ఈరోజు నిహారిక పెళ్లి గురించి ట్విట్టర్ లో స్పందించారు. ఇంతకీ.. చిరు ఏమన్నారంటే.. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు అని తెలియచేసి.. నిహారికను ఎత్తుకున్న చిన్నప్పటి ఫోటో, పెళ్లి కూతరు అయినప్పుడు తీసుకున్న పోటోను పోస్ట్ చేయడం విశేషం. చిరు ట్వీట్ కి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
చాలా మంది నెటిజన్లు.. మరి పవన్ ఎప్పుడు వస్తారు..? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే అభిమానులు కూడా ముందస్తుగా నిహారికకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన ఇంకా అక్కడకు చేరుకోలేదు. బహాశా ఈరోజు పవన్ కళ్యాణ్ ఉదయ్ పూర్ చేరుకోవచ్చు.
Mus Read ;- మెగా డాటర్ పెళ్ళికి ప్రత్యేక అతిథి ఈయనేనా?