ఆ మధ్య కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి . కానీ అది ఇప్పటిలో నిజమయ్యే అవకాశాలు లేవంటున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ తర్వాత యన్టీఆర్ తోనే సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్. అతడు కూడా జక్కన్న సినిమా కంప్లీట్ అయ్యాకా… మాటల మాంత్రికుడి ప్రాజెక్ట్ పైనే ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నాడు. ఈలోగా సంభాషణల రచయితగా ఇతర సినిమాలకు పని చేస్తున్నారు త్రివిక్రమ్ . అలాగే.. మహేశ్, వంశీ పైడిపల్లి తో కూడా ప్రాజెక్ట్ ఉండే అవకాశం లేదు.

తాజా సమాచారం ప్రకారం – మహేష్ బాబు తనతో ‘ సరిలేరు నీకెవ్వరూ ‘ సినిమా తెరకెక్కించిన అనిల్ రావిపూడి తోనే తన తదుపరి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాత అనిల్ సుంకర ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి నిర్మాత. రాజమౌళి సినిమా ఉన్నా , అనిల్ రావిపూడి అయితే క్విక్ గా సినిమా పూర్తి చేస్తాడని మహేష్ బాబు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వెంకీ, వరుణ్ తో ‘ఎఫ్ 3’ తెరకెక్కించే మూడ్ తో ఉన్న అనిల్ రావిపూడి.. సరిగ్గా ‘ఎఫ్ 2’ తర్వాత మహేశ్ తో ‘సరిలేరు నీకెవ్వురు’ తీసిన తరహాలోనే.. ‘ఎఫ్ 3’ తర్వాత మహేశ్ తో మరో సినిమా తెరకెక్కించడం ఆశ్చర్యమే. మరి అనిల్ ఈ సారి మహేశ్ తో ఇంకెలాంటి మ్యాజిక్ చేయబోతాడో..
Must Read ;- దర్శకేంద్రుడు మహేష్ మూవీకి చేసినట్టే.. ఇప్పుడూ చేస్తున్నారా.?











