తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు మూడు వేలకు పైగా పాటలు పాడి సుమధుర గాయనిగా సునీత పేరు తెచ్చుకున్నారు. మరోవైపు డబ్బింగ్ కళాకారిణిగా పలువురు ప్రముఖ హీరోయిన్లకు తన వాయిస్ అందించారు. కాగా ఇటీవల ఆమె నిశ్చితార్థం మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనినితో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఓ హోటల్ లో అత్యంత సన్నిహితుల మధ్య ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది ఇక తమ వివాహ తేదీ ఎప్పుడన్నది త్వరలో ప్రకటిస్తామని వారు ఆ సందర్భంగా ప్రకటించారు కూడా.
తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం వీరి వివాహం జనవరి 9న జరగనున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా..మరోసారి శనివారం రాత్రి హైదరాబాద్ , గచ్చిబౌలిలోని బౌండరీ హిల్స్ లో సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ జరగనుంది. ఈ పార్టీకి మాత్రం సన్నిహితులతో పాటు సినీరంగానికి చెందిన పలువురిని ఆహ్వానించారు.
Must Read ;- సరదాగా సాగిన సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ











