తారక్.. ఎంత బిజీగా ఉన్నా.. సందర్భం వచ్చిందంటే సోషల్ మీడియాలో తన స్పందన తెలియచేస్తూనే ఉంటారు. అదే పండగలు వచ్చాయంటే.. అందరికీ గ్రీటింగ్స్ తెలియచేస్తుంటారు. ఈరోజు క్రిస్మస్. ఈ సందర్భంగా గ్రీటింగ్స్ ని స్పెషల్ గా చెప్పారు. ఎలా అంటే.. తనయులు అభయ్ రామ్ – భార్గవ్ రామ్ ఫోటోలను పోస్ట్ చేసి మేరీ క్రిస్మస్ అంటూ గ్రీటింగ్స్ తెలియచేసారు. ఈ ఫోటోల్లో అభయ్ రామ్ ని భార్గవ్ రామ్ ముద్దుపెట్టడం.. భార్గవ్ రామ్ ను అభయ్ రామ్ ముద్దుపెట్టడం చూడముచ్చటగా ఉంది. ఈ ఫోటోలు నందమూరి అభిమానులనే కాకుండా అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తారక్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. మెగా హీరో చరణ్ – నందమూరి హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ 2021 దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత మార్చి నుంచి ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది వాస్తవమేనా కాదా అనేది తెలియాల్సివుంది.
Must Read ;- ఒకే డ్రెస్ లో లిటిల్ సూపర్ స్టార్స్ ..!











