చాలా ఆహ్లదభరిత వాతావరణంలో సందడి సందడిగా సాగిన ఈ వేడుకకు సినీరంగంలోని తనకు అత్యంత సన్నిహితులు, స్నేహితులను మాత్రమే సునీత ఆహ్వానించింది. అలాగే రామ్ వీరపనేని మిత్రులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు.
నిర్మాత, బిజినెస్ మేగ్నెట్ అయిన రామ్ వీరపనేనితో,సునీతల నిచ్ఛితార్ధం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న రెండు కుటుంబ సభ్యుల సమక్షంలో వారి వివాహం జరపాలని నిర్ణయమైంది. దానికి కాస్త ముందుగానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ వేడుకలో సునీతకు సన్నిహితులైన రేణుదేశాయ్, యాంకర్ సుమ తదితరులు పాల్గొన్నారు.