మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ సింగర్ సునీత ఈ రోజు ఉదయం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొద్దీ రోజుల నుండి ఆమె రెండో వివాహం గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని మొన్నామధ్య ఆ వార్తల్ని ఖండించారు ఆమె. అయితే ఈ రోజు ఆమె డిజిటల్ మీడియాలోని ప్రముఖ వ్యక్తి మ్యాంగో అధినేత రాము తో నిశ్చితార్ధం చేసుకున్నారు. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సునీత 19 సంవత్సరాలకే కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. వారి పేర్లు ఆకాష్, శ్రేయ. ఆమె భర్తతో వచ్చిన గొడవలు కారణంగా ఇద్దరు విడిపోయారు. కాని పిల్లలు మాత్రం సునీత వద్దే ఉంటున్నారు.
భర్త నుండి విడిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోమని సునీతకు కుటుంబసభ్యులు సలహాలు ఇచ్చారు. అయితే తన పిల్లల భవిష్యత్ కోసం ఇప్పటి వరకు ఆమె వివాహం చేసుకోలేదు. ఇంత కాలానికి ఆమె తన వివాహం పై దృష్టి పెట్టినట్లు సన్నిహితులు తెలిపారు. ఆమె ప్రస్తుతం చేసుకుంటున్న వ్యక్తికి కూడా ఇది రెండో వివాహం అని తెలుస్తోంది. కరోనా కారణంగా అతి కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 27న పెళ్ళి చేసుకోబోతున్నారు.
తెలుగు, తమిళ్ భాషలలో అనేక పాటలను పాడారు సునీత. అంతేకాకుండా 15 సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించి అందరిని ఆశ్చర్యపరిచారు. గాయనిగానే కాకుండా హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పారు సునీత. ఇప్పటి వరకు సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు సునీత. ఆమె వైవాహిక జీవితం ఆనందమయంగా సాగాలని కోరుకుందాం..
Must Read ;- ది కంప్లీట్ యాక్టర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఇదే.. !