పిలిస్తే పలుకుతా అనేలా ఉంది నటుడు సోనూ సూద్ పరిస్థితి. ముఖ్యంగా సోషల్ మీడియలో ఆయనను అప్రోచ్ అయితే చాలు వారికి జవాబులు ఇవ్వడం, వారి కోరికను తీర్చడం పనిగా పెట్టుకున్నాడు సోనూ సూద్. ఓ పక్క సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నా ఇంత సమయం ఆయనకు ఎలా దొరుకుతుందో అర్థంగావడం లేదు. కొంతమంది హీరోలను గానీ, నటులను గానీ ఇంటర్వ్యూ అడిగితే టైమ్ లేదంటూ బిల్డప్ ఇస్తుంటారు. అలాంటి ఓ బిజీ నటుడు జనం కోరికలు తీర్చడం కోసం తన విలువైన సమయాన్ని కేటాయించడం విశేషమే.
తాజాగా ఓ కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుట్టు మిషన్ మీద సోనూ సూద్ కూర్చుని కుట్టడం చూస్తుంటే సోనూ సూద్ టైలర్ గా ఎప్పుడు మారాడబ్బా అంటూ అందరూ చూడటం మొదలెట్టారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఈ వీడియోను షేర్ చేశారు. తన షాపులో ఉచితంగా సేవలు అందిస్తానంటూ కూడా సెటైర్ వేశారు. తన దగ్గర అంత టాలెంట్ లేదని కూడా పేర్కొన్నారు. మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆ షూటింగ్ స్పాట్ లో బట్టలు కుట్టే మిషన్ కనిపించిందట. వెంటనే అక్కడ కూర్చుని కుట్టడం ప్రారంభించారు.ప్యాంట్ కుట్టడానికి ప్రయత్నిస్తే అది నిక్కరుగా మారందట. అందుకనే తన దగ్గర ఎవరైనా కుట్టించుకుంటే గ్యారంటీ లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదండోయ్ ‘ఆచార్య’ చిత్ర యూనిట్ కి ఆయన 100 సెల్ ఫోన్లు పంపిణీ చేయడం కూడా విశేషంగా చెప్పుకున్నారు. అన్నట్టు ఆయన నటించిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే.
ఆయనను విలన్ గా చూపిస్తే బాగుండదేమోనని ఆయన పాత్రను కొంత మార్చి ఆయనలోని మంచి తనాన్ని కూడా ఇందులో చూపారు దర్శకుడు. విలన్ మంచి వాడిగా మారితే సమాజంలో ఎలా ఉంటుందోగానీ సినిమాల్లో మాత్రం దర్శకులకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటోంది. అంతా బాగానే ఉంది కానీ ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడోనని భయపడి ఆయనను టార్గెట్ చేసే వారు కూడా పొంచి ఉన్నారు. ఈ విషయంలో సోనూ జాగ్రత్త పడితే మంచిదేమో.
Sonu Sood tailor shop.
यहां मुफ्त में सिलाई की जाती है।
पैंट की जगह निकर बन जाए, इसकी हमारी गारंटी नहीं 😂 pic.twitter.com/VCBocpUSum— sonu sood (@SonuSood) January 16, 2021