Srinu Vaitla Planning Multi Starrer For Chiru And Bunny
మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ఇద్దరి కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట వెంకీ డైరెక్టర్. ఇంతకీ ఎవరా వెంకీ డైరెక్టర్ అంటారా..? విక్టరీ వెంకటేష్ తో నారప్ప సినిమాను తెరకెక్కించిన సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఎప్పటి నుంచో చిరు, బన్నీ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మెగాస్టార్ చేస్తున్నగాడ్ ఫాదర్ సినిమాలో అల్లు అర్జున్ ఓ కీలక పాత్ర చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి కానీ.. నిజం కాలేదు. అయితే.. ఇప్పుడు చిరు – బన్నీ కాంబినేషన్లో మూవీ చేయడం కోసం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఓ భారీ మల్టీస్టారర్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారని టాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే వెంకటేష్ – మహేష్ బాబుల కాంబినేషన్లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ మల్టీస్టారర్ మూవీ చేయడం.. ఈ మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం తెలిసిందే. ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ ను నారప్ప అంటూ ఫుల్ యాక్షన్ మూవీలో పర్ ఫెక్ట్ గా చూపించి సక్సస్ సాధించారు. ఇలా భారీ చిత్రాలను, ఇద్దరు స్టార్ హీరోలను పర్ ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి శ్రీకాంత్ అడ్డాల.. ఆయా హీరోల అభిమానులను కూడా మెప్పించారు. ఇప్పుడు చిరు – బన్నీ లకు కూడా అదే విధంగా తెర మీద ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
Srinu Vaitla Planning Multi Starrer For Chiru And Bunny
ప్రస్తుతం చిరంజీవి, అల్లు అర్జున్.. వీరిద్దరూ వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కలిసి ఈ మల్టీస్టారర్ సినిమా చేస్తారని అంటున్నారు. ఈ క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనుందని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మెగా అభిమానులు ఇది వాస్తవమేనా..? కాదా..? అని ఆరా తీస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల వీరిద్దరి కోసం కథ అయితే.. రెడీ చేస్తున్నారట. మరి.. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఈ ప్రాజెక్ట్ కనుక సెట్ అయితే.. మెగా అభిమానులకు పండగే.