నాడు – నేడు పోషించిన పాత్ర అద్భుతం!
నాడు ప్రతిపక్ష నాయకుడి పాత్రలో జగన్ రెడ్డి పాదయాత్ర .. తదనంతరం రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పాత్రలో ఆయనను చూస్తుంటే .. ‘బాహుబలి సినీమాలోని బల్లాలదేవుడి పాత్ర గుర్తొస్తోంది. సింహాసనం దక్కించుకోవాడానికి కన్నతల్లిని, సొంత తమ్ముడిని సైతం ఎలా వెన్నుపోటు పొడుస్తాడో అదే మాదిరిగా నేడు ఏపీలో జగన్ రెడ్డి ప్రస్థానం సాగుతోందన్నది వాస్తవం. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే ఆయన లక్ష్యం. ప్రజారంజక పాలన అన్న పదం మాటల్లోనే కానీ .. చేతల్లో కించిత్తయినా ఆయన పాలన విధానాల్లో కనిపించడంలేదు అన్నది సత్యం. సంక్షేమాలకు కోట్లు కుమ్మరిస్తే సానుభూతి పదిలంగా ఉంటుందని కలగంటున్నాడు అంతే … పెడుతున్న తాకట్లు, చేస్తున్న అప్పులు, సాగిస్తున్న ఆరాచకాలంతా ప్రజలు గమనిస్తునే ఉన్నారు. అంతిమంగా జగన్ రెడ్డి బ్రతుకు చిత్రం తాలూకు పూర్తి ఎపిసోడ్ ప్రజలకు ఎప్పుడో అర్థమైంది.
నడిచాడు .. హామీలు గుప్పించాడు .. నట్టేటా ముంచాడు!
13 జిల్లాల్లో 341 రోజులపాటు పాదయాత్ర చేశాడు జగన్ రెడ్డి. అడుగడుగునా మోసం, దగా, కుట్రలతో కూడి హామీలు గుప్పించారు .. కానీ ఒక్కటి కూడా అమలు రూపం దాల్చలేదన్నది ప్రతిపక్షాల విమర్శ. టీడీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, బాధ్యతతో అందించి సంక్షేమమే తప్పా .. జగన్ రెడ్డి పాలనలో ఏం జరగలేదన్నదే నిజం. నవరాళ్లు పేరుతో చేసిన మోసం అందరూ గమనిస్తునే ఉన్నారు. ప్రభుత్వం పరిథిలో ఉన్న అనేక శాఖలకు సంబంధించిన నిధులను, ఆదాయాన్ని నవవైఫల్యాలకు బదాలాయించి రాష్ట్రాన్నిఅప్పులు పాలు చేశాడు. తీరా రెండునరేళ్ల తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే .. రాష్ట్రానికి పట్టిన అధోగతి బోధపడుతోంది. ఇలా విధ్వంసకర ప్రభుత్వానికి వైఫల్యాలు, ఉన్మాద చర్యలు తోడై రాష్ట్రం సర్వత్రా సంక్షోభంలోకి నెట్టివేయబడ్డిందని సర్వేలు చెబుతున్న సత్యాలు.
నవ వైఫల్యాలతో నరకం చూస్తున్న ప్రజలు ..
సోషల్ మీడియాతోపాటు కొన్ని మాధ్యమాల్లో జగన్ రెడ్డి వైఫల్యాలను కలంకట్టి కసిగా రాయాల్సిన పనిలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత నిర్ణయాలను జెస్ట్ ఫోకస్ చేస్తే చాలు రాష్ట్రం సర్వత్రా ఏ స్థాయిలో భ్రష్టుపట్టించారన్నది కళ్లకు కడుతోంది. 2019, మే 30 విధ్వంసక పాలనకు పదవీ బాధ్యతల తీసుకున్న జగన్ రెడ్డి .. తన మాటల్లో దాగి ఉన్న మోసం,దగా తొలి సంతకం వృద్ధాప్య పింఛన్ పథకంతోనే బట్టబయలైంది. అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.3 వేలు పింఛన్ అన్న ఎన్నికల హామీ కాస్తా ఉన్న పింఛన్ కు రూ.250 జోడించి, రూ 2,250 గా ఖరారు చేస్తూ సంతకం పెట్టిన వైనం ఇప్పటికీ గుర్తే. విడదల వారీగా ఏటా పెంచుతానని చెప్పి 30 నెలలు కావస్తున్నా .. అతీగతి లేదు. అక్కడినుంచి లగాయత్తు జగన్ రెడ్డి పాలనలో సాగించిన నవ – వైఫల్యాలు ప్రజలకు ప్రత్యక్ష్య నరకం చూపించాయి. ఇంకా సిగ్గులేకుండా రాష్ట్రంలో తమ నాయకుడు చేసిన దగయాత్రకు నాలుగేళ్లు పూర్త్యైందని ఆ పార్టీ నేతలు వేడుకలు చేసుకుంటున్నారా? అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నవ వైఫల్యాల నుంచి పుట్టుకొచ్చి సంక్షోభ పథకాల అమలకు చేస్తున్న వేలకోట్ల అప్పులకు జాతీయ బ్యాంకులే కాదు, ప్రపంచ బ్యాంకులు సైతం హడలిపోతున్నమాట వాస్తవం కాదా? స్టేట్ డెవల్ప్మెంట్ కార్పోరేషన్ పేరిట మీరు సాగిస్తున్న ఉన్మాద ఆర్థిక విధానాలకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్నిసార్లు కోర్టు మెట్లెక్కారో గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఆస్తులు, ఎండోమెంట్, పరిశ్రమలశాఖ, రెవిన్యూ, ఎయిడెడ్ వంటి అనేక సంస్థల భూములను, కొన్ని శాఖల భవిష్యత్ ఆదాయాన్ని క్యాబేజీ స్లైస్ లా తనఖా పెట్టి తెస్తున్న అప్పులకు సంబంధించిన చిట్టా విప్పల్సిన పనిలేదు. వాటిద్వారానే నెలవారీ పథకాలు, ఉద్యోగుల జీతాలు నడిపిస్తున్నారన్నది నగ్న సత్యాల విధితమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రెండునరేళ్లపాలనలో రాష్ట్రాభివృద్థి, ఆదాయ వనరుల పెంపు, ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో యువతకు ఉపాధి కల్పన వంటి వాటిపై క్షేత్రస్థాయిలో దృష్టిసారించలేదన్నదే వాస్తవ పరిస్థితి. ఇదిలా ఉంటే ఎక్కడా అప్పులు పుట్టక నిత్యావసర,పెట్రోలు, డిజీల్ ధరలు, విద్యుత్ చార్జీలు వంటి అమాంతం పెంచి పేదప్రజలపై గుదిబండాను మోపుతున్నాడు.
Must Read ;- ‘డిఫాల్టర్’ముద్రతో ఏపీలో ఆర్థిక అఘాతం!











