ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్న ఈ పిటిషన్ ను వాయిదా వేస్తూ తీర్పు వెలువడింది.
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు అనంతరం సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం ముందస్తు బెయిల్ విచారణను నవంబర్ 8 వరకు వాయిదా వేస్తున్నట్లు తీర్పు నిచ్చింది. సుప్రీం ధర్మాసనం తీర్పును అనుగుణంగా అప్పటి వరకు ఎటువంటి అరెస్ట్ చేయవద్దని సీఐడీకి సూచించింది.దీనిపై స్పందించిన సీఐడీ తరుఫున న్యాయావాదులు కోర్టుకు నవంబర్ 8 వరకు అరెస్ట్ చేయమని ధర్మాసనానికి తెలిపారు.
ఈ నేపధ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్న ఫైబర్ నెట్ పీటి వారెంట్ పై యథాతథ స్ధితిని కొనసాగించాలన్న సుప్రీం సూచించింది. చంద్రబాబును అరెస్టు చేయొద్దని సీఐడీని ఆదేశించింది. స్కిల్ తీర్పును ముందుగా ఇచ్చిన తరువాత ఫైబర్ నెట్ అంశం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. కానీ విచారణకు అవకాశం ఇవ్వాలని కోరిన సీఐడీని.. కానీ అదేమీ అవసరం లేదని.. చంద్రబాబును అరెస్ట్ చేయడానికి వీలు లేదని సుప్రీం స్పష్టం చేసింది. సీఐడీ, ఏపీ పోలీసులను ఇదే అంశం పై ఆదేశించింది.
ఇప్పటికే సుప్రీంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్విష్ పిటిషన్ వాదనలు ముగిశాయి. అయితే తీర్పును సుప్రీం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు తీర్పు వస్తోందని టీడీపీ వర్గాలు.., చంద్రబాబు తరుఫున వాదిస్తున్న న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.