మెజార్టీ తగ్గించడానికి రూ.400 కోట్ల ఖర్చు
మంగళగిరి లో రూ.200 కోట్లు ఖర్చు చేసిన వైకాపా
కుప్పం లో రూ.200 కోట్లు ఖర్చు చేసిన వైకాపా
మంగళగిరి లో రాంకీ, కుప్పం లో పిఎల్ఆర్ కంపెనీ ప్రతినిధులు ద్వారా స్పెషల్ ఆపరేషన్
రూ.20 వేలు ఇస్తే పార్టీ మారే నేతకు అక్షరాలా రూ.20 లక్షలు ఇవ్వడం నియోజకవర్గంలో హాట్ టాపిక్
మంగళగిరి, కుప్పం నియోజకవర్గాల్లో గెలవడం కష్టం అని నిర్ధారణకు వచ్చిన వైకాపా అధినాయకత్వం ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. జగన్ పై అలిగి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైకాపా లో చేరడానికి కొన్ని షరతులు పెట్టాడు నియోజకవర్గంలో తన అనుచరులు ప్రారంభించి సగంలో ఆపేసిన పనులు, అసలు ప్రారంభించని పనుల కు గాను రూ.150 కోట్ల బిల్స్ క్లియర్ చేయించుకున్నాడు. దానితో పాటు ఎన్నికల్లో పెట్టబోయే ఖర్చు అంతా తన చేతుల మీదే జరగాలి అని కండిషన్ కూడా పెట్టాడు. ఎన్నికల ముందు ఎన్ని సర్వేలు చేయించినా మంగళగిరి, కుప్పం నియోజకవర్గాల్లో గెలవడం కష్టం అని సర్వే సంస్థలు తేల్చేయడంతో చివరి అస్త్రంగా మెజార్టీ తగ్గించడమే టార్గెట్ గా జగన్ ధన బలం నమ్ముకున్నారు. మంగళగిరి లో ఎంపీ అయోధ్య రామి రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి కి చెందిన రాంకీ సంస్థ ఉద్యోగస్తులను రంగంలోకి దింపి డబ్బు పంపిణీ చేశారు ఓటు కి రూ. 4 వేలు, కొన్ని చోట్ల రూ.5 వేలు, కొన్ని చోట్ల బంగారపు ముక్కు పుడకలు కూడా పంచారు. వైకాపా నుండి టిడిపి లో చేరిన ఒక చిన్న నాయకుడికి రూ.20 లక్షలు ప్యాకేజ్ ఇచ్చి తిరిగి వైకాపా లో చేరుకున్నారు. వాస్తవానికి అతను రూ.20 వేలు ఇస్తే చాలు అనుకునే స్థాయి నాయకుడు. ఒక నాయకుడికి మూడున్నర కోట్లు ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే నాయకుల్ని, ఓట్లర్ని కొనడానికి కేవలం ఎన్నికల్లోనే రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఇంత జరుగుతున్నా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మురుగుడు, కాండ్రు కుటుంబాలకు అసలు ఏం జరుగుతుంది, డబ్బు పంపిణీ వివరాలు కానీ ఏమీ తెలియదు అఖరికి వారి ఇంటి ముందు వేసిన తాటాకుల పందిరి కూడా ఎమ్మెల్యే ఆర్కే డిసైడ్ చేసి వేయించిందే. మీడియా లో పనిచేస్తున్న తన అనునయులకి లక్షల్లో ప్యాకేజ్ ఇచ్చి మిగిలిన వారిని కనీసం పట్టించుకోకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. రూ.200 కోట్లు ఖర్చు చేసాం విజయం సాధించడం ఖాయం కదా అని అధిష్ఠానం ఆరా తియ్యగా.. గెలుపు కాదు సార్ మీరు పంపిన డబ్బుకి మెజార్టీ తగ్గించడమే కష్టమైన పని అని ఆళ్ల సోదరులు చెప్పడంతో జగన్ కి పట్టలేని కోపం వచ్చిందట. ఇక కుప్పం సంగతీ అంతే ఓటు కి రూ.4 వేలు, నాయకుల్ని కొనడానికి, చీరలు, గడియారాలు, వెండి వస్తువులు పంపకానికి సుమారుగా రూ.200 కోట్లు ఖర్చు చేశారు. పెద్దిరెడ్డి కి సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగస్తులు రంగంలోకి దిగి నేరుగా డబ్బు పంపిణీ చేశారు. భరత్ కి అధిష్ఠానం నుండి కాల్ రాగానే గట్టిగా చేసాం సార్ అన్నాడు. ఏం చేసావ్ అనగానే మెజార్టీ తగ్గించడానికి ప్రయత్నం చేశాం అని చెప్పగానే ఫోన్ చేసిన సదరు అధిష్ఠానం మనిషి ఆశ్చర్యానికి గురయ్యారు అంట. రూ.400 కోట్లు పోయాయి ఇంత ఖర్చు మెజార్టీ తగ్గించడానికా? అనుకోని అన్ని సర్దుకోవడం మంచిదని ఫిక్స్ అయ్యారట సదరు సీఎంఓ ముఖ్యుడు.