April 22, 2026 5:33 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

సంపాదకీయం : ఏపీ సర్కార్ ఇప్పటికైనా ఒప్పుకుంటుందా?

‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు చాలా సాహసోపేతంగా సంపూర్ణ మద్యనిషేధం దిశగా రకరకాల చర్యలతో అడుగులు వేస్తున్నారు’ అని అందరూ అనుకుంటున్నారు. కానీ.. ఈ నిర్ణయాలు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తున్నాయో.. ఇప్పటికైనా  ప్రభుత్వం ఒప్పుకుంటే బాగుంటుంది.

October 8, 2020 at 8:47 AM
in Editorial, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సంపూర్ణ మద్యనిషేధం అనేది జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ. ఆ రకంగా, ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేలా, మహాత్మా గాంధీ స్వప్నాన్ని మన రాష్ట్రంలో సాకారం చేస్తానని ఆయన మాట ఇచ్చారు.

సంపూర్ణం అనగా.. చాలా పరిమితంగా మాత్రం అనుమతిస్తూ నిషేధం తెస్తానని తర్వాతి కాలంలో క్లారిటీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. పాలన మొదలైన తర్వాత మద్యం దుకాణాల సంఖ్య తగ్గించినా, ధరలు పెంచినా అన్నీ.. నిషేధం దిశగా పడుతున్న అడుగులే అని ప్రజలు అనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అబ్కారీ పన్నులే అతిపెద్ద ఆదాయవనరుగా మారిపోయిన పరిస్థితుల్లో- మద్యనిషేధాన్ని ఇష్టపడే వాళ్లు- జగన్ తీసుకుంటున్న చర్యలను సాహసంగానే భావిస్తూ, అభినందించారు. 

ఏపీలో కొవిడ్ కాలంలో కొన్నాళ్లు మద్యం దుకాణాల్ని మూసి ఉంచిన తర్వాత.. లిక్కర్ రేట్లు మళ్లీ పెరిగాయి. ప్రజలకు అలవాటు అయిన బ్రాండ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఊరూ పేరూ తెలియని చీప్ బ్రాండ్లను అత్యధిక ధరలకు కొనాల్సిన అగత్యం ఏర్పడింది.

ఈ పరిణామాలపై.. జగన్మోహన్ రెడ్డి తన అనుకూలురైన లిక్కర్ తయారీదార్లకు అనుచిత లబ్ధి చేకూర్చడానికే.. పాపులర్ బ్రాండ్లు దొరకని పరిస్థితి సృష్టించి, చీప్ బ్రాండ్లను మాత్రమే విక్రయించేలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి గానీ.. నిషేధాన్ని కోరుకునే వారు మాత్రం.. ఆ దిశగా ఇది కూడా మరొక అడుగు అనే అనుకున్నారు. 

విపరీతంగా పెరిగిన స్మగ్లింగ్

రెండోదశలో- పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ బీభత్సంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అన్ని సరిహద్దు ప్రాంతాలను లెక్కలోకి తీసుకుంటే ప్రతిరోజూ కొన్ని లక్షల రూపాయల విలువైన మద్యం స్మగ్లింగ్ అవుతూ పోలీసులకు పట్టుబడుతూనే ఉంది. ఇది దొరుకుతున్న లిక్కర్ విలువ మాత్రమే. అంటే పోలీసుల కంటపడకుండా.. మరెన్ని లక్షల, కోట్ల రూపాయల విలువైన మద్యం ఏపీలోకి స్మగుల్ అవుతోందో తెలియదు. ఈ స్మగ్లింగ్ దందాల్లో దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులూ ఉంటున్నారు. రాజకీయం అంటేనే తప్పుడు మార్గాల్లో ఆర్జించే వారికి ఒక కవచం లాంటి అడ్డాగా నిర్వచనాలు మారిపోతున్న ఈ రోజుల్లో.. నేతలు అనేక మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఒక బీజేపీ నేత స్వయంగా స్మగుల్ చేస్తూ దొరికారు. 2019 ఎన్నికల్లో  మచిలీపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీచేసిన గుడివాక రామాంజనేయులు (అంజిబాబు) తెలంగాణ నుంచి లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. ఆయన్ని పార్టీనుంచి సస్పెండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, దుర్గ గుడి ధర్మకర్తల మండలి సభ్యురాలు చుక్కా నాగవరలక్ష్మి కారులో కేసులకొద్దీ లిక్కర్ పట్టుబడింది. ఆమె దుర్గగుడి బోర్డు  పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి దృష్టాంతాలు అనేకం వెలుగుచూశాయి.

ఈ క్రమంలో.. రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం స్మగ్లింగ్ మీద కోట్లు ఆర్జించేస్తున్నారని, సరిహద్దు పోలీసులతో వైసీపీ నాయకులకు దోస్తీ కుదిరిందని..  వారు వారు కుమ్మక్కయి లిక్కర్ దందాలు నడిపిస్తున్నారని కూడా గంపగుత్తగా బోలెడు ఆరోపణలున్నాయి. సంపూర్ణ మద్య నిషేధం వస్తుందేమో అని జగన్ నిర్ణయాలు చూసి ఆశపడుతున్న వారు.. ఇలాంటి ఆరోపణలు రాజకీయమైనవే తప్ప.. పార్టీకి అంటగట్టడం కరెక్టు  కాదని, ఏదో కొందరు వ్యక్తులు అలా చేస్తుండవచ్చునని అనుకుంటూ వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు. 

‘శానిటైజర్ మరణాలు’ వింత!

కొవిడ్ ప్రబలడం, దానితోపాటుగా శానిటైజర్‌లు విస్తృతంగా అందుబాటులోకి రావడం.. అది ప్రజల అవసరంగా మారడం నేపథ్యంగా.. వచ్చిన దుష్పరిణామం శానిటైజర్ తాగి పేదలు మరణించడం అనేది! రాష్ట్రంలో ఆగస్టు నాటికి కనీసం 36 మంది శానిటైజర్ తాగి మరణించినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కేసులు నమోదు అయ్యాయి. ఇవి నమోదైన కేసులద్వారా వచ్చిన గణాంకాలు మాత్రమే. సామూహిక మరణాలు సంభవించిన సందర్భాల్లో రికార్డు అయిన గణాంకాలు మాత్రమే. ఒక్కొక్కరుగా చచ్చిపోతే అవేవీ పెద్దగా గణాంకాల్లోకి ఎక్కకపోయి ఉండొచ్చు. మొత్తంగా ఈ ఖాతాలో వంద మరణాలు ఉన్నా ఆశ్చర్యం లేదు. 

ఇవన్నీ శానిటైజర్ మరణాలే అని అందరూ అంటారు. కానీ.. వాస్తవంలో నాటు సారా తయారీ రాష్ట్రంలో పెరిగిందని, ఎక్సైజు అధికారులు పట్టించుకోవడం మానేశారని లేదా కుమ్మక్కయ్యారని, నాటుసారా వినియోగం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఒక వాదన కూడా ఉంది. ఈ వాదన నమ్మదగినదే. ఎందుకంటే- శానిటైజర్ సామూహిక మరణాలు సంభవించిన కొన్ని సందర్భాల్లో వారి ఇళ్ల వద్ద పదుల సంఖ్యలో ఖాళీ శానిటైజర్ సీసాలను చూపించి, వారికి శానిటైజర్ తాగే అలవాటు ఉన్నట్టుగా ‘సృష్టింపబడే’ సాక్ష్యాలు పోలీసు రికార్డులకు ఉపయోగపడవచ్చు గానీ.. ప్రజలకు మాత్రం వెటకారంగా అనిపిస్తాయి. అంటే నాటు సారామరణాలు బయటపడిన ప్రతిసారీ.. వాటిని శానిటైజర్ మరణాలుగా చిత్రించడానికి ప్రభుత్వ పెద్దలు, పోలీసులు తమ శక్తిమేర ప్రయత్నించారనడంలో ఎంతో కొంత నిజం ఉంది. 

ఇటీవలి కాలంలో శానిటైజర్ మరణాల ఉధృతి తగ్గింది గానీ.. నాటు సారా తయారీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉంది. కొన్ని కేసులు క్రమంతప్పకుండా ప్రతిచోటా బయటపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మద్యనిషేధం కోసం తీసుకుంటున్న చర్యలు.. పరోక్షంగా నాటు సారా తయారీకి కారణమయ్యాయి. ఆ దందాను పెంచిపోషిస్తున్నాయి. ‘‘రాష్ట్రంలో నాటు సారా తయారీ లేనేలేదు, ఇదంతా మద్యనిషేధం కోసం, గాంధీజీ కలల్ని సాకారం చేయడం కోసం జగన్మోహన రెడ్డి తీసుకుంటున్న మంచి పనులు చూసి ఓర్వలేని వారు చేస్తున్న దుష్ప్రచారం’’ తరహా డైలాగులు అధికార పార్టీ నుంచి వినిపిస్తే ఆశ్చర్యం లేదు. 

అలాంటి వారు.. ఇప్పుడేమంటారు?

అలా సమర్థించుకునే వారుంటే.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో బయటపడిన సంఘటన నేపథ్యంలో ఏమంటారో చూడాలి? శ్రీకాకుళం జిల్లా పలాస మండల కేంద్రంలోని  సూదికొండ కాలనీ కోతి సింహాచలం అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సింహాచలం, అతని కొడుకు ఆదినారాయణ ఇద్దరిపై అదే ప్రాంతానికి చెందిన ప్రత్యర్ధులు కత్తులు,కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సింహాచలం ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆదినారాయణ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఇంతకూ ఈ హత్యకు  కారణం ఏంటో తెలుసా? ఫ్యాక్షన్ తగాదాలు గానీ, అక్రమ సంబంధాలు గానీ కాదు. నాటు సారా విక్రయాల్లో ఇరు వర్గాల మధ్య గొడవ రేగింది. ఇరు వర్గాలూ నాటు సారా కాసి అమ్ముకునే వాళ్లే. వారి తగాదా.. ఒక ప్రాణం తీసింది. పోయిన ప్రాణం దాగిన గుట్టును బయటకు తెస్తోంది. రాష్ట్రంలో నాటుసారా తయారీ అనేది విశృంఖలంగా ఉన్నదనే గుట్టు బయటపెడుతున్న దుర్ఘటన ఇది. 

‘‘రాష్ట్రంలో ఒక మూల ఒక సంఘటన జరిగితే.. రాష్ట్రానికంతా దానిని ఆపాదిస్తారా.. ఇది కుట్ర’’ అని ఎవరైనా గేలిచేయచ్చు, గోల చేయవచ్చు. కానీ, ఇది వాస్తవం. నాటుసారా తయారీ విశృంఖలంగా ఉన్న మాట నిజం. ఎక్సయిజ్ కేసులు ప్రతిచోటా నమోదు అవుతూనే ఉన్నాయి. ఆ శాఖ గణాంకాలు చూసినా ఆ సంగతి విపులంగా అర్థమవుతుంది.

ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పుపట్టలేం

నాటుసారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది గనుక.. దాఖలాలు దొరుకుతున్నాయి గనుక.. జగన్ మోహన్ రెడ్డి సర్కారు పూర్తి బాధ్యత వహించాల్సిందే అని నిందించడానికి కూడా వీల్లేదు. ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటూనే ఉంది. వాటి ప్రభావం కూడా ఎంతో కొంత కనిపిస్తూనేఉంది. 

లిక్కర్ ధరల పెంపు, తదితర నిర్ణయాల ప్రభావం.. నాటుసారా తయారీకి దారితీస్తున్న నేపథ్యంలో ఎక్సైజు శాఖనే జగన్ దాదాపుగా రెండు ముక్కలుగా చేశారు. ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఇబి) ఏర్పాటుచేశారు. ఐడీ (ఇల్లిసిట్ డిస్టిల్డ్ లిక్కర్) అని ఎక్సైజు పరిభాషలో చెప్పుకునే నాటుసారా తయారీని, ఇసుక అక్రమ దందాలను అడ్డుకోవడం ఈ ఎస్ఇబి పని. ఇసుక దందా కేసులు వారు పట్టుకున్నా, తర్వాత వాటిని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగిస్తారు. నాటుసారా తయారీపై వారే కేసులు నమోదు చేస్తారు. ఈ ఏడాది మే 16న ఈ ఎస్ఇబి ఏర్పాటు అయింది. దీనికింద ప్రతి జిల్లాకు ఒక ఎడిషనల్ ఎస్పీని కూడా ఇన్చార్జిగా నియమించారు. అప్పటినుంచి కొంతవరకు నాటు సారా తయారీ కట్టడి అయిందనే చెప్పాలి. కానీ ఇప్పటికీ విశృంఖలంగా జరుగుతూనేఉంది. ఒక జిల్లాలో నెలకు సగటున వందకు పైగా నాటు సారా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కడప జిల్లాలో కొంత తక్కువగానే ఉంది గానీ, కర్నూలు, చిత్తూరు, గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాటు సారా తయారీ కేసులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. 

ఇప్పుడు సిక్కోలు హత్య నేపథ్యంలో అసలు ఈ నాటు సారా తయారీ దందాలను ఒకసారి సమీక్షించుకోవాల్సి ఉంది. నాటుసారా వల్ల తాగిన వారు చచ్చిపోవడమే కాదు, తయారుచేసే వారు చచ్చిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం మరింత కఠినంగా చర్యలు తీసుకుని ఈ అరాచకాల్ని అడ్డుకోవాలి. నాటుసారా కంటె ఎక్కువగా, సంపూర్ణ మద్యనిషేధం అనే జగన్మోహన్ రెడ్డి స్వప్నానికి తూట్లు పొడుస్తున్న లిక్కర్ స్మగ్లింగ్ ను కూడా మరింత సమర్థంగా కట్టడి చేయాలి. 

.. సురేష్ పిళ్లె

kamspillai@gmail.com

Tags: illicit liquorleotopliquor smugglingnatusara tayareesuresh pillaisuresh pillai editorial
Previous Post

తాడికొండ ఎమ్మెల్యేకు కొత్త శత్రువు 

Next Post

కొత్త రేషన్ కార్డులు సిద్దం : లబ్దిదారులేరీ?

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

Anchor Vishnu Priya Hot Stunnig Photos

‘ఆక్సిజన్’ మృతులకు కొవ్వొత్తుల నివాళి : చంద్రబాబు

నీకు మెంటలా? : సీఐపై శివమెత్తిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist