టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గత కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారు.. ఆయనపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ లిస్టులోకి తాజాగా టీబీజేపీ నేతలు కూడా చేరిపోయారు.. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలలో వేలు పెడుతున్నారని, ఆయన కాంగ్రెస్‌కి పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్నారని చిందులు తొక్కారు.. ఆయనకు ఇక్కడి రాజకీయాలతో ఏం పని అని ప్రశ్నించారు.. ఈ కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో పెను దుమారం రేపుతున్నాయి..
తెలంగాణ ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీజేపీ రెండో స్థానంలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అనూహ్యంగా తొలగించడం, ఆ స్థానాన్ని కిషన్ రెడ్డితో భర్తీ చేయడంతో ఈక్వేషన్లు మారిపోయాయి.. ఇటు, కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా తెలంగాణను తాకింది.. వీటితో తెలంగాణలో బీజేపీ హవా తగ్గి, కాంగ్రెస్ జోరు ప్రారంభమయింది.. బీఆర్‌ఎస్‌ని ఢీ కొట్టే పార్టీ కాంగ్రెస్ అనే ప్రజలు భావిస్తున్నారనే లెక్కలు వినిపిస్తున్నాయి.. కేసీఆర్‌కి చెక్ పెట్టి, కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటుందనే స్థాయిలో కొన్ని సర్వేలు అంచనాలు వెలువరిస్తున్నాయి.. బీజేపీకి మూడో స్థానం దక్కనుందనే వాస్తవం ఆ పార్టీ నేతల కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది..
చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కూడా టీబీజేపీని తాకింది.. బీజేపీ కీలక నేతలు, మోదీ, అమిత్ షా సహకారంతోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు అరెస్ట్‌పై నిర్ణయం తీసుకొని ఉంటారని ప్రజలు భావిస్తున్నారు.. ఇదే తెలంగాణలో బీజేపీకి నెగిటివ్‌గా మారుతోంది.. గతంలో టీడీపీతో పొత్తుతో బీజేపీ భారీ విజయాలను సొంతం చేసుకుంది తెలంగాణలో.. చంద్రబాబుపై అక్కసుతోనే మోదీ టీమ్… జైలుకి పంపిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. తాజాగా బెయిల్ దక్కడంతో ప్రస్తుతం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారో అనేది బిగ్ పజిల్‌గా మారింది తెలంగాణ రాజకీయ పార్టీలకి..
చికిత్స కోసం చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు.. ఆయన అరెస్ట్ తర్వాత హైదరాబాద్‌లో పలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి.. ఈ ప్రభావం తెలంగాణలో బీఆర్‌ఎస్‌పై బలంగా పడనుందనే విశ్లేషణలు సాగుతున్నాయి.. ఇది కాంగ్రెస్‌కి కలిసి వస్తుందనే లెక్కలు వినిపిస్తున్నాయి.. ఇదే జరిగితే, బీఆర్‌ఎస్ నుండి బయటకి వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజకీయ భవితవ్యం డైలమాలో పడనుంది. ఇదే ఈటలకు షాకింగ్‌గా మారింది..
మరోవైపు, బీజేపీ నుండి వరసగా అనేకమంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటుంటున్నారు.. ఇప్పటికే అనేకమంది కాషాయదళం నేతలు గాంధీ భవన్‌కి జంప్ అయ్యారు. ఈ లిస్టులోకి తాజాగా విజయశాంతి, కొండా విశ్వేశ్వరరావు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.. ఇది ఈటల, కిషన్ రెడ్డి లాంటి నేతలను బాగా ఇబ్బందికి గురి చేస్తోంది.. అందుకే, ఈటల తన అక్కసును వెళ్లగక్కారని, బాబుపై శాపనార్ధాలకు దిగుతున్నారని గుర్తు చేస్తున్నారు… మరి, ఈటల వ్యాఖ్యలకు టీటీడీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి..