టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే వైసీపీ నీలి, కూలి మీడియా ఓ రేంజ్‌లో విరుచుకుపడుతోంది.. ఆయన పేరు కనిపించినా, వినిపించినా నెగిటివ్ కథనాలు వండి వార్చడానికి మసాలాలు రెడీగా పెట్టుకుంటుంది.. అలాంటి నీలి, కూలి మీడియా కూడా బాబు విడుదల తర్వాత చంద్రబాబుకి అనుకూల కథనాలు ప్రసారం చేయడం, కథనాలు తమ వెబ్ సైట్లలో ప్రచురించడం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతోంది…
పేటీఎమ్ జర్నలిస్ట్‌గా ముద్రపడిన జర్నలిస్ట్ సాయి.. రాజమండ్రి జైలు నుండి బెయిల్‌పై బాబు విడుదల తర్వాత జరిగిన ర్యాలీపై నోరెళ్లబెట్టారు.. చంద్రబాబుకి, ఆయన ఇమేజ్, ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణతోపాటు టీడీపీ కార్యకర్తల పనితీరుపై ప్రశంసలు కురిపించారు.. అలాంటి ర్యాలీని గతంలో ఎన్నడూ చూడలేదని, ఇది అపూర్వ ఘటన అని వివరించారు.. రెండు గంటలపాటు జరగాల్సిన ప్రయాణాన్ని ఏకంగా 14 గంటలపాటు, అందులోనూ ప్రతి టౌన్, గ్రామంలో బాబుకి నీరాజనాలు పలికారు ప్రజలు.. ఇదే పేటీమ్ కార్యకర్తలు, నీలి, కూలి మీడియాని సైతం అబ్బురపరిచేలా చేసింది..
ఇటు, వైసీపీ డిజిటల్ మీడియా కరపత్రికగా భావించే ఓ టాప్ గాసిప్ వెబ్ సైట్ కూడా చంద్రబాబు ఇమేజ్‌పై కీలక కథనం ప్రసారం చేసింది.. రాజమండ్రి నుండి విజయవాడ కరకట్ట వరకు సాగిన ర్యాలీతో బాబు ఇమేజ్, గ్రాఫ్ పెరగడమే కాదు, అది జగన్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకి అద్దం పడుతోందని ఈ ఆర్టికల్ సాగింది.. జగన్ ఇప్పటికి అయినా తన పాలన, విధానాలపై పునః పరిశీలించుకోవాలని ఈ టాప్ గాసిప్ వెబ్ సైట్ సంచలనాత్మక కథనం ప్రచురించింది..
వీటితోపాటు పలు వైసీపీ వెబ్ సైట్లు, పేటీఎమ్ జర్నలిస్టులు.. చంద్రబాబుపై సానుకూలంగా వీడియోలు, ఆర్టికల్స్ డెలివర్ చేయడం టీడీపీ శ్రేణులని నివ్వెర పరుస్తోంది.. వాటిని విపరీతంగా షేర్ చేస్తున్నారు టీడీపీ అభిమానులు.. వీటిపై బులుగు మీడియా డైలమాలో పడిపోయింది.. ఏం చేయాలో తెలియక, వీటికి ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక తికమకపడింది.. మొత్తమ్మీద, చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ టీడీపీకి సానుకూలంగా మారుతుంటే, వైసీపీకి నెగిటివ్ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది.. ఈ షాక్ నుండి వైసీపీ ఎలా బయటపడుతుందో చూడాలి..