స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు హత్యకు కుట్రలు పన్నుతున్నారు. అందుకు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు పై హత్యయత్నం జరుగుతోందా..? అందుకు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయా..? అంటే అవుననే సమాధానాలు వినవస్తున్నాయి. దీనిపై న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు పలు అనుమాలను లేవనెత్తారు.
స్కిల్ కేసు అరెస్ట్ అయిన తొలిరోజే చంద్రబాబుకు డౌట్ కొట్టింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అలా అడుగుడు పెట్టి పెట్టకముందే పెన్ కెమేరాతో ఆయనను చిత్రీకరించడం మొదలు పెట్టారు కొంతమంది పేటీఎం బ్యాచ్. సీక్రెట్ గా విజువల్స్.., ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి శునకానందం పొందారు. దీనిపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. కానీ దానిని సైతం లెక్క చేయకుండా డోన్ కెమెరాలతో జైలు పరిశరాలను, కుటుంబ సభ్యుల ములాఖత్ లను చిత్రీకరించడం మొదలు పెట్టారు. ఇదే అంశాన్ని చంద్రబాబు న్యాయమూర్తికి రాసిన లేఖలో వాపోయ్యారు.
రాజమండ్రి కేంద్ర కారాగారం లో భద్రత లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. నిత్యం డోన్ ల పర్యవేక్షణ, వైద్యంపై సరైన రిపోర్టులు ఇవ్వకుండా చంద్రబాబును తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వైద్యులిచ్చిన రిపోర్టును మార్చి.. తాడేపల్లి ప్యాలెస్ సూచనల మేరకు తయారు చేసిన వైద్య రిపోర్టును జైలు అధికారులు బయటకు రిలీజ్ చేస్తున్నారని టీడీపీ తోపాటు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
ఆరోగ్యపరంగా, భద్రతాపరంగా తీవ్ర ఆందోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. న్యాయస్థానాల్లో బెయిల్ పిటిషన్ వేసి అభ్యర్ధిస్తున్నారు. కానీ ప్రాసుక్యూషన్ చేసే భిన్నమైన, బెస్ లెస్ వాదనలతో న్యాయస్థానాలు తప్పుదోవ పడుతున్నాయని అభిప్రాయాలు లేకపోలేదు. దీంతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బాబుకు జైల్లో ప్రాణహాని ఉందని.. ఆయన ఆరోగ్యం పతాక స్థాయిలో పడిపోతోందని.. న్యాయస్థానాలు తమ అభ్యర్ధనలను మన్నించి.., బెయిల్ మంజురు చేయమని చేయాలని కోరుతున్నా.. రోజురోజుకు బెయిల్ అంశంలో జాప్యం జరుగుతూనే ఉంది.
ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రం ఆగ్రాహావేశాలతో అట్టుడుకుతుంటే.. ఆయనకేమైనా జరగరానిది జరిగితే రాష్ట్రం రావణకాష్టం మాదిరిగా తగలపడటం ఖాయమన్నట్లు సంకేతాలు లేకపోలేదు. రోజురోజుకు నిరసనలు మిన్నంటుతున్న వేళ.. క్షీణిస్తున్న చంద్రబాబు ఆరోగ్యంపై సరైన సమయంలో న్యాయస్థానాలు స్పందించాల్సిన బాధ్యత ఉంది. సకాలంలో వైద్య సేవలకు న్యాయస్థానాలు కలగజేసుకుని ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలని చంద్రబాబు తరుఫున కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.